AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilanka: అన్నం పెట్టిన వ్యక్తి మరణంతో కన్నీరు పెట్టిన కోతి.. మృతుడికి ముద్దు పెట్టి నివాళి.. వీడియో వైరల్

ఎప్పటిలా ఆహారం కోసం వచ్చిన కోతికి తన స్నేహితుడు కనిపించలేదు. దీంతో అతడిని వేడుకుంటోంది. అప్పుడు అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు.

Srilanka: అన్నం పెట్టిన వ్యక్తి మరణంతో కన్నీరు పెట్టిన కోతి.. మృతుడికి ముద్దు పెట్టి నివాళి.. వీడియో వైరల్
Srilanka Monkey Love
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2022 | 1:51 PM

ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అనిపిస్తున్న ఈ రోజుల్లో కూడా చిన్న పాటి సాయాన్ని గుర్తు పెట్టుకునే మూగజీవులున్నాయని అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. కనిపెంచిన తల్లిదండ్రులను కూడా కడుపున పుట్టిన పిల్లలు ఖరీదు కట్టే లోకంలో ఉన్నాం.. ఆదరించి అన్నం పెట్టిన వారినే కసాయితనంతో కడతేరుస్తున్న విశ్వాస ఘాతకుల గురించి లెక్కలేనన్ని సంఘటన గురించి వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా తనకు అన్నం పెట్టిన వ్యక్తి మరణించాడని ఓ వానరం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చూపరుల హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్థానికంగా ఓ వ్యక్తి మరణించాడు. అతని మృత దేహం వద్దకు అనేక కుటుంబ సభ్యలు, స్నేహితులు నివాళులు అర్పిస్తున్నారు.  కుటుంబ సభ్యులు దుఃఖిస్తున్నారు. అయితే వీరితో పాటు ఒక వానరం కూడా అతని మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకుంది. ఆ కోతిని గుంపులో ఉన్న వ్యక్తులు అక్కడ నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

ఇవి కూడా చదవండి

ఆ కోతికి మృతుడికి మంచి స్నేహం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కోతికి అతను రోజూ క్రమం తప్పకుండా ఆహారం పెట్టేవాడని తెలుస్తోంది.  ఆ వానరం అతడితో సరదాగా ఆడుకొనేది. అయితే ఈ నెల 18న అతడు మరణించాడు. ఎప్పటిలా ఆహారం కోసం వచ్చిన కోతికి తన స్నేహితుడు కనిపించలేదు. దీంతో అతడిని వేడుకుంటోంది. అప్పుడు అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. అంతలో వానరం తన స్నేహితుడి మృతదేహం వద్దకు చేరుకొని.. తట్టి లేపే ప్రయత్నం చేసింది. అతడి పాదాల దగ్గర కూర్చుంది.

ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదో తనిఖీ చేయడమే కాదు..  కోతి తాను వచ్చాను అనే సందేహం ఇచ్చేలా మరణించిన వ్యక్తిని ప్రేమగా తట్టి లేపడానికి ప్రయత్నించింది. వానర ప్రేమ చూపరుల హృదయాన్ని కలిచి వేసింది.  ఎంతకూ లేవకపోయే సరికి కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..
ఫోన్ పేలో బంగారం లాంటి ఆఫర్.. రేపు ఒక్కరోజే అవకాశం
ఫోన్ పేలో బంగారం లాంటి ఆఫర్.. రేపు ఒక్కరోజే అవకాశం
గోయెంకా నిజ స్వరూపం బయటపెట్టిన మిశ్రా!
గోయెంకా నిజ స్వరూపం బయటపెట్టిన మిశ్రా!
'మీరు ఆ పార్టీలో చేరుతున్నారా?' నెటిజన్‌కు ప్రీతి ఘాటు రిప్లై
'మీరు ఆ పార్టీలో చేరుతున్నారా?' నెటిజన్‌కు ప్రీతి ఘాటు రిప్లై
10th విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు
10th విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు
ఇంట్లో ఎంత డబ్బు పెట్టుకోవచ్చు ? ఇన్కం ట్యాక్స్ రూల్స్ ఏమిటంటే?
ఇంట్లో ఎంత డబ్బు పెట్టుకోవచ్చు ? ఇన్కం ట్యాక్స్ రూల్స్ ఏమిటంటే?
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో