Brazil Plane Fight: విమానంలో విండో సీటు కోసం ఫైట్‌.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు .. నెట్టింట వీడియో వైరల్

వైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడి కోసం సీటు మార్చుకోగలరా? అని ఓ మహిళ తోటి ప్రయాణికుడిని అడిగింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. అంతే..ఆ ప్రయాణికుడి కుటుంబంపై విరుచుకుపడింది.

Brazil Plane Fight: విమానంలో విండో సీటు కోసం ఫైట్‌.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు .. నెట్టింట వీడియో వైరల్
Brazil Plane Fight
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 12:50 PM

బస్సులోనో, రైలులోనే వెళ్తున్నప్పుడు విండో సీటు కోసం పోటీ పడడం మీరు చూసే ఉంటారు. పోటీపడటమేంటి.. కొట్టుకునే వరకూ వెళ్తారు. మరి ఇదే సీన్ విమానంలో జరిగితే? జరిగితే ఏంటి… జరిగింది. ఓ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు విండో సీట్‌ కోసం కుస్తీ పట్టారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫలితంగా రెండు గంటలపాటు విమానం ఆగిపోయింది. ఈ ఘటన బ్రెజిల్‌లోని గోల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో జరిగింది. అసలేం జరిగిందంటే…

బ్రెజిలియన్ న్యూస్ అవుట్‌లెట్ ‘అవెంచురాస్ నా హిస్టోరియా’ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సాల్వడార్-కాంగోన్‌హాస్ విమానంలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఫ్లైట్‌ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఏమైందో తెలీదు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. వైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడి కోసం సీటు మార్చుకోగలరా? అని ఓ మహిళ తోటి ప్రయాణికుడిని అడిగింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. అంతే..ఆ ప్రయాణికుడి కుటుంబంపై విరుచుకుపడింది. ఈ క్రమంలో వారిమధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు కుమ్మేసుకున్నారు వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, విమాన కెప్టెన్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

విమానం మధ్య వరుసలో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ దాడులు చేసుకుంటూ అరాచకం సృష్టించారని సిబ్బంది పేర్కొన్నారు. గొడవ పడిన ప్రయాణికులను దించేసి రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది. వారి గొడవను చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?