AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎదురు కట్నం ఇస్తా.. ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. ప్లకార్డుతో రోడ్డెక్కిన యువకుడు

ఓ వ్యక్తి ఒకడుగు ముందుకేసి.. తనకు గవర్నమెంట్‌ ఉద్యోగం చేసే యువతే భార్యగా కావాలంటూ ఏకంగా ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కాడు. అవసరమైతే నేనే ఎదురు కట్నం ఇస్తానంటున్నాడు.

Viral News: ఎదురు కట్నం ఇస్తా.. ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. ప్లకార్డుతో రోడ్డెక్కిన యువకుడు
Madhya Pradesh Man Viral Ph
Surya Kala
|

Updated on: Jan 28, 2023 | 12:50 PM

Share

కన్యాశుల్కం నుంచి వరకట్నంలోకి అడుగు పెట్టింది. దీంతో గత కొన్ని దశాబ్దాల నుంచి తమ కూతురు కోసం అల్లుడిని తీసుకొచ్చే పర్వంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పిల్లాడు గవర్నమెంట్‌ ఉద్యోగి అయితే కూతురు సుఖపడుతుందని భావించేవారు. అందుకు పెద్దమొత్తంలోనే ముట్టజెప్పి అలాంటి సంబంధాలు వెతికి వెతికిమరీ కుదుర్చుకొని వివాహాలు చేసుకునేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది.. ఉద్యోగం చేసే అమ్మాయిల కోసం అబ్బాయిలు ఎగబడుతున్నారు. అమ్మాయి చదువుతో పాటు మంచి ఉద్యోగం చేస్తే మరింత బావుంటుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఒకడుగు ముందుకేసి.. తనకు గవర్నమెంట్‌ ఉద్యోగం చేసే యువతే భార్యగా కావాలంటూ ఏకంగా ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కాడు. అవసరమైతే నేనే ఎదురు కట్నం ఇస్తానంటున్నాడు.

మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతానికి చెందిన వికల్ప్ మాల్వి తనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతి భార్యగా రావాలంటూ ఓ రోజు రద్దీగా ఉన్న ఫౌంటెయిన్ చౌక్ వీధిలో పెద్ద ప్లకార్డు పట్టుకుని నిలుచున్నాడు. పసుపు రంగు పేపర్ పై హిందీలో పెద్ద అక్షరాలతో విషయం రాసివుంది. అది చూసి దారిన పోయే వారంతా నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ ప్లకార్డులో ‘‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు కావాలి. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయికి నేను కట్నం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

నాకూ పెళ్ళాం కావాలి

ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. నిజంగా వికల్ప్‌ ప్రభుత్వ ఉద్యోగిని వివాహం చేసుకోడానికి ఈ పని చేయలేదట.. సరదాగా అందరినీ కాసేపు నవ్విద్దామని అలా చేశాడట. ఇది విన్నవారు ‘ఓరి నీ యాశాలో..’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, వికల్ప్‌కి ఇలాంటి ఫన్నీ వీడియోలు చేయడం ఓ హాబీ అట. కాగా నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు. వందలాదిమంది లైక్‌ చేస్తూ రకరకరాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,