విదేశాల నుంచి అరుదైన జంతువుల అక్రమ రవాణా.. స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన అధికారులు.. పట్టుబడినవి..
బెంగళూరు: బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు అరుదైన జంతువుల అక్రమ రవాణా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎయిర్ సిబ్బంది. బ్యాంకాక్ నుండి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ముగ్గురు ప్రయాణీకులను జనవరి 22న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు వారి లగేజీని పరీక్షించి పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు DRI వారి చెక్-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేసింది. దీని ఫలితంగా 14 సరీసృపాలు సహా 18 స్థానికేతర, అరుదైన జంతువులను అధికారులు […]
బెంగళూరు: బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు అరుదైన జంతువుల అక్రమ రవాణా సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎయిర్ సిబ్బంది. బ్యాంకాక్ నుండి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ముగ్గురు ప్రయాణీకులను జనవరి 22న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు వారి లగేజీని పరీక్షించి పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు DRI వారి చెక్-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేసింది. దీని ఫలితంగా 14 సరీసృపాలు సహా 18 స్థానికేతర, అరుదైన జంతువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అరుదైన జంతువులను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. అరుదైన జంతువులను స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిపై కస్టమ్స్ చట్టాల కింద కేసు నమోదుచేశామని అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్ నుంచి ఇలాంటి అరుదైన జంతువులను తరలిస్తున్నట్టుగా అధికారులు తేల్చారు. నిర్ధిష్టమైన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని చెప్పారు.
ఇదేతరహాలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 34 అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జీవులతోపాటు 48 జాతులకు చెందిన 139 జంతువులను రక్షించారు. వాటిని జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అవన్నీ స్మగ్లింగ్ చేసిన జంతువులేనని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..