AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఇక మార్పు వచ్చేది ఎన్నడు.. మరీ ఇలానా.. మురికి కూపాలుగా మారుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. మురికి కూపాలుగా మారుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు కొత్తగా ప్రారంభించిన..

Vande Bharat Express: ఇక మార్పు వచ్చేది ఎన్నడు.. మరీ ఇలానా.. మురికి కూపాలుగా మారుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
Vande Bharat Express
Ganesh Mudavath
|

Updated on: Jan 28, 2023 | 2:37 PM

Share

ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. మురికి కూపాలుగా మారుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెత్తతో నిండిపోయింది. దీనిని గమనించిన రైల్వే అధికారులు.. రైలును పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులకు సూచించారు. అయితే అధికారులు చేసిన విజ్ఞప్తిని ప్రజలు పట్టించుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోపల చెత్త పేరుకున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అవనీష్ శరణ్ ఇంటర్నెట్‌లో చిత్రాన్ని పంచుకుంటూ క్యాప్షన్‌లో ‘వి ది పీపుల్’ అని రాశారు. ఉపయోగించిన అద్దాలు, నీళ్ల సీసాలు, ఆహార ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ వస్తువులు అన్నీ నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫొటోలు వైరల్ అయినప్పుడు.. డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సారథి ప్రయాణీకులను కోచ్‌లను శుభ్రంగా ఉంచాలని కోరారు. చెత్త పారేయడం కోసం డస్ట్‌బిన్‌లను ఉపయోగించాలని అభ్యర్థించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పౌరులు బాధ్యత వహించడం ప్రారంభించినప్పుడే స్వచ్ఛ భారత్ నినాదాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సహకరించాలని అనుప్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

కొత్తగా ప్రారంభించిన, స్వదేశీయంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాలతో మరింత సౌకర్యవంతమైన, సౌకర్యవంతమైన, త్వరగా గమ్యస్థానానికి చేరుకునేలా డిజైన్ చేశారు. అయితే.. ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. శుభ్రం చేశాక.. ఒక కుప్పగా వేశారని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే