Viral Video: క్యూట్ గా జనగణమణ పాడుతున్న బాలుడు.. మాతృభూమికి ప్రత్యేకత తీసుకొచ్చిన భావిభారత పౌరుడంటూ ప్రశంసలు

వైరల్ అవుతున్న వీడియోలో.. చిన్న పిల్లవాడు జన గణ మన మనసారా పడుతున్నాడు. చిన్నారి ఉచ్చారణలో కొద్దిగా తడబాటు ఉన్నా.. మీరు నిజంగా పట్టించుకోరు. ఎందుకంటే అతని క్యూట్ నెస్ హృదయాన్ని తాకుతుంది.

Viral Video: క్యూట్ గా జనగణమణ పాడుతున్న బాలుడు.. మాతృభూమికి ప్రత్యేకత తీసుకొచ్చిన భావిభారత పౌరుడంటూ ప్రశంసలు
Little Boy Singing Jana Gan
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 16, 2022 | 3:52 PM

Viral Video: 76వ స్వాతంత్యదినోత్సవ వేడుకలను  దేశ వ్యాప్తంగా అంగరంగ వైభంగా జరుపుకున్నాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు భారతదేశ జాతీయ గీతం.. జన గణ మన పాడాడు. ఈ వీడియో వెర్టిగో వారియర్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో లక్ష వ్యూస్ ను సొంతం చేసుకుంది. బాలుడి అందమైన చేష్టలు నెటిజన్లను ప్రేమలో పడేలా చేశాయి. వైరల్ అవుతున్న వీడియోలో.. చిన్న పిల్లవాడు జన గణ మన మనసారా పడుతున్నాడు. చిన్నారి ఉచ్చారణలో కొద్దిగా తడబాటు ఉన్నా.. మీరు నిజంగా పట్టించుకోరు. ఎందుకంటే అతని క్యూట్ నెస్ హృదయాన్ని తాకుతుంది.

“మన జాతీయ గీతం అత్యంత హృదయపూర్వక ప్రదర్శనలలో ఇది ఒకటి. స్వచ్ఛమైన హృదయపూర్వక భావోద్వేగం.! స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

నెటిజన్లను చిన్నారి ఆకట్టుకున్నాడు. చిన్నారి బాలుడిని లవ్ సింబల్స్ ఎమోజీలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల సమయంలో ఇది నిజంగా ముఖ్యమైన అనుభూతి. మేము చాలా ఉన్నత స్థాయి 1000+ కండోమినియం సొసైటీలో జీవిస్తున్నాం.. మాలో కేవలం 30 మంది మాత్రమే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా   జెండాను ఎగురవేయాలని భావించారు. కనుక నువ్వు గొప్ప వ్యక్తివి.. ఈ అమాయకపు చిన్నారి పాడిన గీతాన్ని ప్రేమించడం ద్వారా నా దేశభక్తి వ్యక్తమవుతుందని మరొకరు కామెంట్ చేశారు. ఓహ్..  నా ప్రియమైన భారత దేశమా.. వీరు మన భావి పౌరులు, హృదయపూర్వకంగా దేశం పట్ల ప్రేమతో నిండి ఉన్నారు. చిన్నారులు మాతృభూమికి ప్రత్యేకతను తీసుకొస్తారు. భక్తితో సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి..  జై భారత్.. జై హింద్! అంటూ మరొకరు కామెంట్ చేశారు.

దేశం ఆగస్టు 15, 2022న 76 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంది. ఈ సంవత్సరం, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను చేర్చడంతో వేడుక ప్రత్యేకంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..