AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వాతంత్య దినోత్సవ వేడుకలకు అందంగా ముస్తాబైన ముఖేష్ అంబానీ ఇల్లు.. చూపరులను కట్టిపడేసిన వైనం

యాంటిలియాని త్రివర్ణ పతాకంలోని రంగుల లైట్లతో ఆవిష్కరించారు. ఇంటిని లైట్స్ తో అలంకరణలో భాగంగా జాతీయ జెండా, అశోక చక్రం, జాతీయ జంతువు పులి సహా అనేక చిహ్నాలు ఉన్నాయి. ఇంటిని చూడడానికి అనేక మంది సందర్శకులు యాంటిలియా వెలుపల గుమిగూడారు.

Viral Video: స్వాతంత్య దినోత్సవ వేడుకలకు అందంగా ముస్తాబైన ముఖేష్ అంబానీ ఇల్లు.. చూపరులను కట్టిపడేసిన వైనం
Mukesh Ambani Luxurious Hou
Surya Kala
|

Updated on: Aug 16, 2022 | 1:37 PM

Share

Viral Video: భారతదేశ స్వాతంత్రం దినోత్సవ సంబరాలను ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ ఇంట వైభవంగా  జరుపుకున్నారు. వారు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన  ‘హర్ ఘర్ తిరంగ’ ఉత్సవంలో పాల్గొన్నారు. విలాసానికి ఇంటికి ప్రతిరూపమైన ముంబై లోని ముఖేష్ అంబానీ ఇల్లు (Mukesh Ambani’s luxurious house) యాంటిలియాని త్రివర్ణ పతాకంలోని రంగుల లైట్లతో ఆవిష్కరించారు. ఇంటిని లైట్స్ తో అలంకరణలో భాగంగా జాతీయ జెండా, అశోక చక్రం, జాతీయ జంతువు పులి సహా అనేక చిహ్నాలు ఉన్నాయి. ఇంటిని చూడడానికి అనేక మంది సందర్శకులు యాంటిలియా వెలుపల గుమిగూడారు. తమ చేతిలోని సెల్ ఫోన్లకు, కెమెరాలకు పని చెప్పి.. ఫోటోలు తీసుకున్నారు, వీడియోలను క్లిక్ చేయడం కనిపించింది. అంతేకాదు ఈ చారిత్రాత్మక రోజున అంబానీలు ప్రజలకు ఫలహారాలు కూడా అందించారు.

దిగువ వైరల్ వీడియోలు, చిత్రాలను చూడండి:

ఇవి కూడా చదవండి

అంతకుముందు, శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీల కుమారుడైన పృథ్వీ అంబానీతో కలిసి నీతా, ముఖేష్ అంబానీ స్వాతంత్య్ర  దినోత్సవాన్ని జరుపుకున్నారు.

పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ‘హర్ ఘర్ తిరంగా’ఉత్సవంలో భాగస్వామ్యులయ్యారు. కొందరు జాతీయ జెండాను ఎగురవేశారు, మరికొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ డీపీలను త్రివర్ణ పతాక చిత్రంతో ఏర్పాటు చేసుకున్నారు. అనిల్ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా , వరుణ్ ధావన్, కంగనా రనౌత్ చాలా మంది తమ డీపీలను మార్చారు.

హర్ ఘర్ తిరంగ:  భారతదేశం స్వాతంత్యం పొంది 76 వ సంవత్సరంలో అడుగు పెట్టిన అద్భుతమైన రోజు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో దేశ ప్రజలందరూ భాగస్వామ్యులయ్యారు. ప్రతిచోటా భారతీయులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేసి స్ఫూర్తినింపుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!