AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారతీయులకు పాకిస్థానీ ఆర్టిస్ట్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గిఫ్ట్.. మాకు మీ స్నేహం కావాలంటూ..

పాకిస్తాన్ , భారతదేశం జెండాల ఎమోజీలతో.. ఎల్లలు దాటిన నా వీక్షకులకు ఇదిగో నా బహుమతి అంటూ క్యాప్షన్ జత చేశారు.  "భారతదేశానికి  స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.

Viral Video: భారతీయులకు పాకిస్థానీ ఆర్టిస్ట్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గిఫ్ట్.. మాకు మీ స్నేహం కావాలంటూ..
Pakistani Rabab Artist
Surya Kala
|

Updated on: Aug 16, 2022 | 12:29 PM

Share

Viral Video: భారతదేశం.. 1947 ఆగష్టు 14వ తేదీ అర్ధ రాత్రి భారత దేశం, పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయింది. దాయాది దేశం పాక్ మనకంటే ముందు రోజు అంటే ఆగష్టు 14వ తేదీని స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక మన దేశం  ఆగస్ట్ 15న స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు.. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే వీటన్నిటిలోకీ వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. పాకిస్తానీ కళాకారుడి శుభాకాంక్షలు. విశిష్టమైన ఆలోచనతో భారతీయులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన పాకిస్థానీ కళాకారుడి వీడియోను చూడండి. పాకిస్థాన్‌కు చెందిన రబాబ్ ప్లేయర్ సియాల్ ఖాన్ భారత జాతీయ గీతం జన గణను ప్లే చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. సంగీత వాయిద్యంపై భారతదేశ ప్రజలకు స్పెషల్ విశేష్ ను చెప్పిన ఈ వీడియో నెటిజన్ల నుండి భారీ స్పందనను పొందింది. అతను జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ట్విట్టర్‌లో వీడియో.. పంచుకుంటూ.. పోస్ట్‌కు క్యాప్షన్ కూడా జత చేశారు. ” పాకిస్తాన్ , భారతదేశం జెండాల ఎమోజీలతో.. ఎల్లలు దాటిన నా వీక్షకులకు ఇదిగో నా బహుమతి అంటూ క్యాప్షన్ జత చేశారు.  “భారతదేశానికి  స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు. మన ఇరుదేశాల మధ్య శాంతి, సహనం, మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా తాను భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ట్విట్టర్‌లో 8,855 రీట్వీట్‌లు, 1 మిలియన్ వ్యూస్ ,  56 వేల లైక్‌లను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో:

సియాల్ ఖాన్ జనగణమన ప్లే చేసిన ఈ వాయిద్యం పేరు రబాబ్. ఇది ఒక తీగ వాయిద్యం.. వీణ వలె ఉంటుంది.  పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ , కాశ్మీర్‌లో బాగా ప్రాచుర్యం పొందిన సంగీత వాయిద్యం.

నెటిజన్ల స్పందన: చాలా మంది భారతీయులు అతని స్నేహ భావానికి ధన్యవాదాలు తెలిపారు. “అతను చాలా ప్రతిభావంతుడైన కళాకారుడు. అతను వాయించే వాయిద్యాన్ని రబాబ్ అని పిలుస్తారు. ఈ రబాబ్ పాష్టో సంగీతంలో బాగా ప్రాచుర్యం పొందింది అని కామెంట్ చేశారు. “భారత పౌరుల తరపున మీకు ధన్యవాదాలు. పాక్ ప్రభుత్వం, నేతలు మీ గూఢచార సంస్థలు పాక్ ప్రజలు భారత దేశంతో స్నేహం కోరుకున్న విషయాన్నీ.. పాకిస్తానీ ప్రజల హృదయాన్ని అర్ధం చేసుకోలని తాను కోరుకుంటున్నాను” అని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.