Viral Video: చిన్న పిల్లల్లా మారిన వధూవరులు.. వివాహ వేదికపై పెళ్లి కూతురు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Viral Video: పెళ్లి.. ప్రతీ మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. వందేళ్ల జీవితానికి వివాహం అనేది కీలక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని...
Viral Video: పెళ్లి.. ప్రతీ మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. వందేళ్ల జీవితానికి వివాహం అనేది కీలక మజిలి అని చెబుతుంటారు. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. ఇందుకోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటారు. అందులోనూ తమకు నచ్చిన, తాము ఇష్టపడ్డ వారిని పెళ్లి చేసుకుంటే వధూవరుల సంతోషానికి అవధులు ఉండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఓ నవ వధువు సంతోషానికి అద్దం పడుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ కొత్త జంట వివాహ తంతు పూర్తయిన తర్వాత వరమాలలను మార్చుకుంటున్నారు. ఈ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా మలుచుకోవాలనుకున్న ఆ జంట భారీ ఏర్పాటు చేసుకున్నారు. మొదట వధువు, వరుడి మెడలో మాల వేయడానికి ప్రయత్నించగా.. అతను ఆటపించాడు. తల వధువుకి అందకుండా అటు, ఇటు తిప్పుతూ టీజ్ చేశాడు. దీంతో వధువుకి ఓ ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు ఆడుకునే ‘రాక్ పేపర్ సిజర్స్’ గేమ్‌ను అప్లై చేసింది.
గేమ్‌లో భర్తను ఓడించి, మెడలో మాల వేసేసింది. ఇక భర్త వంతు వచ్చేసరికి.. అతన్ని మాల వేయనివ్వకుండా ఆటపట్టించింది. దీనంతటినీ పెళ్లికి హాజరైన అతిథులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త జంట చేసిన సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..