AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తండ్రి ప్రేమ అనంతం.. పుట్టిన బిడ్డ బుడిబుడి నడకను చూసి మురిసిపోతున్న జిరాఫీ.. వీడియో వైరల్

తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుందని.. ఈ విషయాన్నీ నెటిజన్లు మళ్ళీ గుర్తు చేసుకుంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Viral Video: తండ్రి ప్రేమ అనంతం.. పుట్టిన బిడ్డ బుడిబుడి నడకను చూసి మురిసిపోతున్న జిరాఫీ.. వీడియో వైరల్
Giraffe Dad Meets Newborn S
Surya Kala
|

Updated on: May 29, 2022 | 4:11 PM

Share

Viral Video: తమ పిల్లలపై చూపించే తల్లి ప్రేమకు ఉన్నంత గుర్తింపు..  తన స్వార్ధం చూసుకోకుండా పిల్లల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే నాన్నకు లేదని చెప్పవచ్చు. అయితే మొదటిసారిగా తండ్రిగా మారిన వ్యక్తి.. ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుందని.. ఈ విషయాన్నీ నెటిజన్లు మళ్ళీ గుర్తు చేసుకుంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది ఒక తండ్రి జిరాఫీకి సంబంధించిన వీడియో. 2022 లో వైరల్ అయిన ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంది. తండ్రి ప్రేమ నెటిజన్లను కదిలిస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని సంఘటన యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో జరిగింది. అప్పుడే పుట్టిన తన బిడ్డను చూసుకునేందుకు మైఖేల్‌ తండ్రి జిరాఫీ అక్కడికి వచ్చింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న తన బిడ్డను తల కిందికి దించి ఎంతో ప్రేమగా చూస్తుంటుంది. ఆ పిల్ల జిరాఫీ బుడి బుడి అడుగులు వేస్తుంటే చూసి పొంగిపోతుంది. అనంతరం తనకు తండ్రి ప్రమోషన్‌ ఇచ్చిన తల్లి జిరాఫీని ప్రేమగా ముద్దాడుతుంది.

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ అద్భుతమైన వీడియోను మిలియన్లమంది వీక్షిస్తున్నారు. వేలల్లో లైక్‌ చేస్తున్నారు. హృద‌యాన్ని క‌రిగించే ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ తండ్రి జిరాఫీ ప్రేమ‌కు ఫిదా అవుతున్నారు. తమదైనశైలిలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెడింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us