Viral Video: హనుమంతుని పాదాలచెంత సన్‌గ్లాసెస్‌తో మహిళ.. సడెన్‌గా షాక్ ఇచ్చిన వానరం.. వీడియో చూస్తే హడలే..!
Monkey And Woman Fight: కోతులు ఎంత తుంటరి పనులు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో ఉన్న ఆహార పదార్థాలను, స్మార్ట్‌ఫోన్లను లాక్కోని పారిపోవడం, ఎదురు తిరిగితే మనుషులపై దాడికి పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం.

Monkey And Woman Fight: కోతులు ఎంత తుంటరి పనులు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో ఉన్న ఆహార పదార్థాలను, స్మార్ట్‌ఫోన్లను లాక్కోని పారిపోవడం, ఎదురు తిరిగితే మనుషులపై దాడికి పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం.కోతులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో గుడికి వెళ్లిన ఓ మహిళ అంజనేయ స్వామికి దండం పూజలు చేయడం ప్రారంభిస్తుంది. తన సన్‌గ్లాసెస్‌ను తీసి పక్కన పెడుతుంది. అయితే సడెన్‌గా కోతి అక్కడకు వస్తుంది. సన్‌గ్లాసెస్‌ను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అయితే వాటిని ఇష్టపడి కొనుక్కుందో.. మరే కారణమో తెలియదు కానీ ఆ మహిళ కూడా అస్సలు తగ్గలేదు. తన సన్‌గ్లాసెస్‌ను దక్కించుకోవడానికి కోతితో కుస్తీలు పట్టింది.
సాధారణంగా కోతులు మన వస్తువులను లాక్కెళ్లిపోతే పోతే పోనీలే అని వదిలేస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం మహిళ అలా చేయలేదు. తన సన్‌గ్లాసెస్ కోసం పట్టు వదలకుండా కోతితో ఒక చిన్నపాటి యుద్ధమే చేసింది. పక్కన వాళ్లు సర్ది చెప్పుకున్నా వినలేదు. చివరకు ఎట్టకేలకు తన సన్‌గ్లాసెస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా ఉంది. చూసినవారందరూ నవ్వు ఆపుకోలేకపోతున్నారు.సంజు1290 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయగా మిలియన్ల మంది వీక్షించారు. అలాగే లక్షలాది మంది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేయండి..




View this post on Instagram
ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..