Viral Video: రద్దీ రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్న మందుబాబు.. తర్వాత ఏం జరిగిందో చూడండి
ఓ వైపు వర్షం ఏకధాటిగా పడుతుంటే ఓ తాగుబోతు కుర్చీ పట్టుకుని రోడ్డెక్కాడు. అంతేనా.. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని, తాపీగా కూర్చున్నాడు. అసలే అది బిజీ రోడ్డాయె. ఇంతలో అటుగా ఓ లారీ వచ్చింది. హారన్ కొట్టినా.. మనోడికి సోయ లేదు. అంతే ఒకేఒక్క డ్యాష్ ఇచ్చాడు. దీంతో కుర్చీతో సహా తాగుబోతు బొక్కబోర్లా పడ్డాడు. కొంచెం అయితే లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయ్యే వాడు. త్రుటితో తప్పింకుని..
లక్నో, సెప్టెంబర్ 1: ఓ వైపు వర్షం ఏకధాటిగా పడుతుంటే ఓ తాగుబోతు కుర్చీ పట్టుకుని రోడ్డెక్కాడు. అంతేనా.. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని, తాపీగా కూర్చున్నాడు. అసలే అది బిజీ రోడ్డాయె. ఇంతలో అటుగా ఓ లారీ వచ్చింది. హారన్ కొట్టినా.. మనోడికి సోయ లేదు. అంతే ఒకేఒక్క డ్యాష్ ఇచ్చాడు. దీంతో కుర్చీతో సహా తాగుబోతు బొక్కబోర్లా పడ్డాడు. కొంచెం అయితే లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయ్యే వాడు. త్రుటితో తప్పింకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి భారీ వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని రిలాక్స్‌గా కూర్చున్నాడు. ఒక లారీ అతడి వెనకే వచ్చింది. తప్పుకొమ్మని హారన్ కొట్టిన సదరు వ్యక్తి మాత్రం నిమ్మలంగా కూర్చున్నాడు. దీంతో ఒళ్లు మండిన లారీ డ్రైవర్ కుర్చీతో సహా ఎగిరిపోయేలా ఢీ కొట్టాడు. అయితే అదృష్టవశాత్తు లారీ ట్రైర్ల కింద కాకుండా పక్కన పడటంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లారీ ఢీకొట్టడంతో కుర్చీ విరిగింది. దీంతో అతడు రోడ్డుపై పడిపోయాడు. కింద పడిన తర్వాత కూడా అతగాడు లేవకపోవడం మరో విచిత్రం. అలాగే పడిపోయి రోడ్డుపై వచ్చి, పోయే వాహనాలను చూస్తూ ఉన్నాడు.
A drunk man in Uttar Pradesh’s Pratapgarh had a narrow escape after a truck knocked him down while he was sitting on a chair in the middle of a busy road during heavy rain.
The incident which took place in front of a police booth is said to have occurred on August 29.
Read… pic.twitter.com/6OSUCapnSc
— IndiaToday (@IndiaToday) September 1, 2024
ఆగస్టు 29వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మందుబాబుకు దేహశుద్ధి చేశారు. ఆ వ్యక్తిని అజయ్‌గా పోలీసులు గుర్తించిన పోలీసులు, స్టేషన్‌కు తరలించారు. అయితే అజయ్ మానసిక వికలాంగుడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చేసేదిలేక అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన స్థానిక పోలీస్ బూత్ ఎదురుగా జరిగడంతొ ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.