Viral Video: సముద్ర గర్భంలో డాల్ఫిన్ ప్రసవం.. ఇదివరకెప్పుడూ చూడని షాకింగ్ వీడియో మీకోసం..
Viral Video: మాతృత్వానికి మించింది ఈ లోకంలో మరేది లేదు. ఒక తల్లి మృత్యువు అంచుల వరకు వెళ్లి మరో ప్రాణికి జీవాన్ని పోస్తుంటి.
Viral Video: మాతృత్వానికి మించింది ఈ లోకంలో మరేది లేదు. ఒక తల్లి మృత్యువు అంచుల వరకు వెళ్లి మరో ప్రాణికి జీవాన్ని పోస్తుంటి. ప్రసవం ఆ తల్లికి పునర్జన్మ అనే చెప్పాలి. అది మనుషులు అయినా, మరే జీవి అయినా అంతే. అయితే ఈ భూ ప్రపంచంలో కొన్ని జీవులు ప్రసవం ద్వారా పిల్లలకు జన్మనిస్తే.. మరికొన్ని జీవులు గుడ్ల పెట్టి పొదగడం ద్వారా జన్మనిస్తాయి. మరికొన్ని జీవులు.. తమ తనువును చాలించి బిడ్డలకు జన్మనిస్తాయి.(ఉదాహరణకు తేలు చెప్పుకోవచ్చు).
ఇదిలాఉంటే.. డాల్ఫిన్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అవి చేసే అల్లరి, వాటి తెలివి తేటలు మనల్ని మంత్రముగ్దులను చేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సముద్రంలో ఆడుకుంటున్న డాల్ఫిన్స్‌ని చూడటానికి ఎంతో ముచ్చటేస్తుంది. అవి నీటిలో డైవింగ్ చేస్తుంటే.. కనులవిందుగా ఉంటుంది. మనుషుల మాదిరిగానే తెలివితేటలు ఉన్న డాల్ఫిన్లు.. మనుషుల మాదారిగానే తమ బిడ్డలకు జన్మనిస్తాయిని మీకు తెలుసా?. అవును.. డాల్ఫిన్లు కూడా మనుషుల మాదిరిగానే ప్రసవిస్తాయి. తాజాగా డాల్ఫిన్ ఓ చిన్ని డాల్ఫిన్‌ను ప్రసవించడానికి సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ డాల్ఫిన్ నీటి అడుగున.. తన బిడ్డకు జన్మనివ్వడం స్పష్టం చూడొచ్చు. తల్లి డాల్ఫిన్ కడుపు చీల్చుకుంటూ పిల్ల డాల్ఫిన్ బయటకు వస్తుంది. పిల్ల డాల్ఫిన్ అలా బయటకు వచ్చిందో లేదో.. రయ్‌మని దూసుకువెళ్లింది. తల్లి డాల్ఫిన్‌తో ఈదుతూ చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో theinfomance’s పేరుతో ఉన్న యూజర్ పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. నెటిజన్లు ఆ వీడియోకు లైక్ కొడుతున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ‘సముద్ర జీవులకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో మానవులు జోక్యం చేసుకోకూడదు.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘అద్భుతం.. నవజాత శిశువు కూడా గొప్ప నైపుణ్యంతో ఈత కొట్టడం సూపర్‌గా ఉంది.’ అని మరొకరు రాశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 50 వేల మంది నెటిజన్లు వీక్షించగా.. వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
View this post on Instagram
Also read:
Health Tips: టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా.. చాలా డేంజర్ అంటోన్న ఆయుర్వేద నిపుణులు.. అవేంటంటే?
Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..