Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. రెండు ట్రైన్ల మధ్యలో చిక్కుకున్న గుర్రం.. అప్పుడు ఏం జరిగిందంటే..

Horse Viral Video: మీ పై మీకు నమ్మకం ఉంటే.. ఎలాంటి ఇబ్బందినైనా దృఢంగా ఎదుర్కోవచ్చు. ఆత్మావిశ్వాసంతో ప్రయత్నిస్తే..

Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. రెండు ట్రైన్ల మధ్యలో చిక్కుకున్న గుర్రం.. అప్పుడు ఏం జరిగిందంటే..
Horse Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2022 | 2:14 PM

Horse Viral Video: మీ పై మీకు నమ్మకం ఉంటే.. ఎలాంటి ఇబ్బందినైనా దృఢంగా ఎదుర్కోవచ్చు. ఆత్మావిశ్వాసంతో ప్రయత్నిస్తే.. ఏ సమస్య నుంచి అయినా బయటపడవచ్చు. అన్నింటికంటే ముందు.. తనను తాను విశ్వసిస్తే.. గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.. జీవితంలో ఇదే సూత్రం ఇబ్బందులను అధిగమించేలా చేస్తుంది.. అదేవిధంగా ఆకాంక్షలను నెరవేరుస్తుంది. జీవితంలో గెలిచిన ప్రతిఒక్కరూ సూచించే మార్గమిదే. వాస్తవానికి జీవితంలో చాలా సార్లు అనేక కారణాల వల్ల మనం నిరాశ చెందుతుంటాము. ఇబ్బందులో కూరుకుపోయి.. మనోధైర్యం కోల్పోతాం.. కానీ తనను తాను నమ్ముకున్నవాడు ఎప్పుడూ సరైన మార్గంలో పయనించి గమ్యాన్ని సాధిస్తాడు. ఈ పాఠం అందరికీ వర్తిస్తుంది. దీనిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే.. ఇదే సూత్రాన్ని జంతువుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. తాజాగా ఇలాంటి వీడియో (Viral Video) ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోవడంతోపాటు.. ఇదే ఆత్మవిశ్వాసం అంటూ పేర్కొంటున్నారు. వైరల్ అవుతున్న వీడియో గుర్రానికి (Horse) సంబంధించినది. ఇది ఇబ్బందులను ఎలా అధిగమించాలో తెలియజేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ గుర్రం రెండు రైళ్ల మధ్య ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలో రెండు రైళ్లు కూడా అటుఇటు వేగంగా పోతున్నాయి. ఈ క్రమంలో గుర్రం అక్కడే నిలబడకుండా దిక్కులు చూడకుండా లక్ష్యం వైపు.. గమ్యం వైపు పరుగులు తీస్తుంది. ఇలా పరుగులు తీస్తూ.. చివరకు తన కష్టం నుంచి గుర్రం బయటపడింది. ఈ వీడియోలో రెండు రైళ్ల మధ్య గుర్రం ఎలా ఇరుక్కుపోయిందో మీరు చూడవచ్చు. కానీ.. గుర్రం అక్కడే ఆగకుండా నేరుగా పరిగెడుతుంది. చివరకు ఒక రైలు వెళ్ళిన తర్వాత మరొక ట్రాక్ మీదకు వెళుతుంది. దాని సొంత అవగాహన, నమ్మకమే దాని ప్రాణాన్ని కాపాడిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వీడియో.. 

ఈ వైరల్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ‘గుర్రం రెండు రైళ్ల మధ్య ఇరుక్కుపోయింది. అయినా దానికి పరుగెత్తడం తెలుసు, దారి మార్చకుండా పరుగెత్తుకుంటూ వచ్చి చివరకు బయటకు పడింది.. ఇలానే అందరరూ ముందుకు సాగండి అంటూ ట్విట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 45 వేలకు పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: పాముతో పోరాడిన ఎలుక.. పిల్లను కాపాడుకుని తరిమి.. తరిమి కొట్టింది..

Funny Video: అమ్మబాబోయ్.. ఇదెక్కడి డ్రామా రా బాబూ.. ఈ చిన్నారి యాక్టింగ్ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..