AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sahara Desert Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..

Snowfall in The Sahara Desert: ఎడారులు(Desert) అంటే ఇసుకతో నిండిన వేడి వేడిగా మండే బంజరు భూమి. ఇక్కడ సాధారణంగా ఎటువంటి వృక్షసంపదా, నీరు కనిపించదు. వాస్తవానికి భూమిపై ఎక్కువ..

Sahara Desert Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..
Snowfall In The Sahara Desert
Surya Kala
|

Updated on: Jan 23, 2022 | 11:20 AM

Share

Snowfall in The Sahara Desert: ఎడారులు(Desert) అంటే ఇసుకతో నిండిన వేడి వేడిగా మండే బంజరు భూమి. ఇక్కడ సాధారణంగా ఎటువంటి వృక్షసంపదా, నీరు కనిపించదు. వాస్తవానికి భూమిపై ఎక్కువ భాగంలో ఎడారులే ఉన్నాయి. అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

ప్రపంచంలో ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా అతి పెద్ద ఎడారి ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి (Sahara Desert). గత కొన్ని సంవత్సరాలుగా సహారా ఎడారిలో అరుదైన హిమపాతం కురుస్తోంది. సహారా ఎడారిలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయ.. వాయువ్య అల్జీరియాలోని సహారా ఎడారిలో మళ్లీ మంచు కురిసింది. ఫోటోగ్రాఫర్ కరీమ్ ఎడారిలోని మంచుకురుస్తున్న దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. వాయువ్య అల్జీరియాలోని ఐన్ సెఫ్రా పట్టణంలో ఈ వారం ప్రారంభంలో ఉష్ణోగ్రతలు -2 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఇసుక దిబ్బలపై హిమపాతం భారీగా కురిసింది. ఇసుక మంచు దుప్పటి కప్పుకుని ఉన్న సమయంలో సూర్యరశ్మి పడుతుండగా కనిపించిన దృశ్యాన్ని చిత్రీకరించారు. ఐన్ సెఫ్రా ప్రాంతాన్ని ది గేట్‌వే టు ది ఎడారి అని పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఎడారి చుట్టూ అట్లాస్ పర్వతాలు ఉన్నాయి.

Also Read:  థర్డ్ వేవ్ మరణాల్లో 60 శాతం మంది వారే.. తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..