AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacinda Ardern: ఓ వైపు కరోనా విజృంభణ.. మరోవైపు ఆంక్షలు.. పెళ్లి రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధానమంత్రి..

New Zealand PM Jacinda Ardern: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పుట్టుకొస్తున్న

Jacinda Ardern: ఓ వైపు కరోనా విజృంభణ.. మరోవైపు ఆంక్షలు.. పెళ్లి రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధానమంత్రి..
Jacinda Ardern
Shaik Madar Saheb
|

Updated on: Jan 23, 2022 | 10:46 AM

Share

New Zealand PM Jacinda Ardern: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు అలజడి రేపుతున్నాయి. దీంతో పలు దేశాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వీకెండ్ లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధించాయి. అంతేకాకుండా అన్ని చోట్ల నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశాయి. శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ మార్గర్శకాలను విడుదల చేశాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం సైతం కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఈ ఆంక్షలు ఆదేశ ప్ర‌ధానమంత్రి జ‌సిండా ఆర్డెర్న్ పెళ్లి అడ్డొచ్చాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో త‌న పెళ్లిని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్రధాని జ‌ెసిండా ప్ర‌క‌టించారు. క్లార్క్ గేఫోర్డ్‌, జెసిండా ఇద్దరు స్నేహితులు. చాలా కాలంగా క‌లిసిఉంటున్న‌ జెసిండా.. గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నామని తెలిపారు. అయితే.. వివాహ తేదీని ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ఈ మేరకు జెసిండా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహమ్మారి వ‌ల్ల ఇబ్బందులను అనుభవించిన వారిలో తాను కూడా చేరాన‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందని.. ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే.. భయపడాల్సిన పనిలేదని.. ఈ వైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ నెలఖరు వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని.. అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

Also Read:

America: మృతుని ఇంట్లో 125 పాములు.. 14 అడుగుల కొండచిలువ కూడా.. అసలేం జరిగిందంటే..

15 ఏళ్లుగా భర్త జైలులో ఉంటే.. భార్య మాత్రం నలుగురు పిల్లల తల్లిగా మారింది.. స్టోరీ తెలిస్తే షాక్‌ అవుతారు..?

Follow Us
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..