AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్లుగా భర్త జైలులో ఉంటే.. భార్య మాత్రం నలుగురు పిల్లల తల్లిగా మారింది.. స్టోరీ తెలిస్తే షాక్‌ అవుతారు..?

Palestine Terrorist: జైలు గోడల మధ్య బంధించిన ఓ ఖైదీ ఓ బిడ్డకి తండ్రి ఎలా అవుతాడు? ఓ ఉగ్రవాది చేసిన ప్రకటన ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.

15 ఏళ్లుగా భర్త జైలులో ఉంటే.. భార్య మాత్రం నలుగురు పిల్లల తల్లిగా మారింది.. స్టోరీ తెలిస్తే షాక్‌ అవుతారు..?
Jail
uppula Raju
|

Updated on: Jan 22, 2022 | 7:29 PM

Share

Palestine Terrorist: జైలు గోడల మధ్య బంధించిన ఓ ఖైదీ ఓ బిడ్డకి తండ్రి ఎలా అవుతాడు? ఓ ఉగ్రవాది చేసిన ప్రకటన ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ ఉగ్రవాది జైల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న అతని భార్య నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ నలుగురు పిల్లలు తన పిల్లలే అని ఆ ఉగ్రవాది చెప్పాడు. అతడి పేరు రఫత్ అల్ ఖరావి. ఇతడు ప్రమాదకరమైన పాలస్తీనా ఉగ్రవాది. పదిహేనేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. 2006లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు అరెస్టయి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత 2021 మార్చిలో అంటే గతేడాది మాత్రమే జైలు నుంచి బయటకు వచ్చాడు.

జైలు నుంచి బయటకు రాగానే ఉగ్రవాది ఇంటర్వ్యూ ఇచ్చాడు

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రఫత్ అల్ ఖరావి ఓ ఛానెల్‌కి ఇంటర్వూ ఇచ్చాడు. అందులో భాగంగానే తాను జైలులో ఉన్న సమయంలో నలుగురు పిల్లలకు తండ్రినయ్యానని పేర్కొన్నాడు. తాను జైలు లోపల నుంచి తన స్పెర్మ్‌ను అక్రమంగా తరలించి తన భార్యకు పంపేవాడని తెలిపాడు. దీని సహాయంతో వైద్యులు తన భార్య కడుపులో పిండాన్ని ఏర్పాటు చేశారని చెప్పాడు. డైలీ స్టార్ కథనం ప్రకారం.. ఉగ్రవాది తన స్పెర్మ్‌ను ప్యాకెట్లలో ఉంచి బయటకు పంపేవాడు. జైలు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా ఈ పని చేయించుకునేవాడని తేలింది.

జైలు నుంచి స్పెర్మ్ ఎలా బయటకు పంపాడు..?

రఫత్ అల్-ఖరావీ స్పెర్మ్ ప్యాకెట్‌ని జైలు నుంచి బయటకు పంపడానికి జైలు క్యాంటీన్ మార్గాన్ని ఉపయోగించేవాడు. ఎందుకంటే ఆ రూట్‌లో వచ్చిన వాళ్ల ఇంటరాగేషన్ చాలా తేలికగా ఉండేది. జైలులోని ఈ బలహీనతను ఈ ఉగ్రవాది చట్టవిరుద్ధంగా ఉపయోగించుకున్నాడు. పాలస్తీనియన్ మీడియా వాచ్ పీఎండబ్ల్యూ నివేదిక ప్రకారం.. రఫత్ అల్-ఖరావీ మాట్లాడుతూ.. ‘నేను స్పెర్మ్/వీర్యాన్ని చిప్స్ లేదా బిస్కెట్‌ ప్యాకెట్‌ కవర్స్‌లో దాచి పెట్టేవాడిని. ఆ స్పెర్మ్ ఉన్న కవర్‌ జైలు నుంచి బయటకు వెళ్లగానే దానికోసం నా భార్య లేదా తల్లి వచ్చేవారు. వారు దానిని జైలు నుంచి నేరుగా రజాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ నిపుణుల సహాయంతో తన భార్య గర్భంలో ప్రవేశపెట్టేవారు. ఇలా నలుగురు పిల్లల తండ్రి అయ్యానని’ చెప్పాడు.

ఈ లడ్డూలు తింటే జలుబు, దగ్గు మటుమాయం.. రోగనిరోధక శక్తి సూపర్..

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పని ప్రారంభించండి.. లేదంటే చాలా నష్టం..?

PSL 2022: పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌కి కరోనా ఎఫెక్ట్‌.. ఇప్పటికే 8 మందికి పాజిటివ్‌..