AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మానవత్వం అంటే ఇదే.. కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్.. వీడియో వైరల్..

Delivery man saves dog : అతనొక డెలివరీ డ్రైవర్.. బిల్డింగ్‌లో లిఫ్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి వచ్చిన లిఫ్టులో కుక్క వేలాడుతూ..

Viral Video: మానవత్వం అంటే ఇదే.. కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్.. వీడియో వైరల్..
Dog
Shaik Madar Saheb
|

Updated on: Nov 03, 2021 | 3:54 PM

Share

Delivery man saves dog : అతనొక డెలివరీ డ్రైవర్.. బిల్డింగ్‌లో లిఫ్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి వచ్చిన లిఫ్టులో కుక్క వేలాడుతూ.. కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కుక్క ప్రాణాన్ని కాపాడాడు. ఇదంతా అక్కడున్న సీసీ టీవీలో రికార్డయింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు.. డ్రైవర్‌ను ప్రశసింస్తున్నారు. మానవత్వం అంటే.. ఇదేనంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో.. లిఫ్టు రాగానే.. కుక్క తనంతట తానుగా ఎలివేటర్‌లోకి వెళుతుంది. ఈ క్రమంలో లిఫ్ట్ తలుపులు మూసుకుంటాయి. అయితే.. కుక్కకున్న తాడు లిఫ్ట్ తలుపుల్లో ఇరుక్కుపోతుంది. అక్కడినుంచి కుక్క వేలాడుతూ.. వస్తుంది. అయితే.. తదుపరి అంతస్తులో ఎలివేటర్ తలుపు తెరుచుకోగానే.. కుక్క మెడకు కట్టిన పట్టి బిగుతుగా మారి వెలాడుతూ కనిపిస్తుంది. తదుపరి అంతస్తులో డెలివరీ డ్రైవర్‌.. లిఫ్టు కోసం ఎదురుచూస్తుంటాడు. లిఫ్టు తలుపులు తెరుచుకోగానే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుక్కను చూసి.. చలించిపోతాడు. వెంటనే ఆ డ్రైవర్ ఆ కుక్కను పట్టుకుని.. దానికున్న పట్టీని తొలగిస్తాడు. లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటన అక్టోబర్ 23న జరిగింది. వైరల్ వీడియో..

కుక్క ప్రాణాన్ని కాపాడిన డ్రైవర్ ఆ తర్వాత దానిని సెక్యూరిటీ గార్డుకి అప్పగించాడు. వైరల్‌గా మారిన ఈ ఫుటేజీని యూట్యూబ్‌లో 1.9 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు.. దీంతో ఆ కుక్క బతికి బయటపడిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అతను నిజంగా గ్రేటేనని.. కుక్క ప్రాణాలను కాపాడాడంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..