AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video: మీరు ఎప్పుడో ఒకసారి మొసలిని చూసే ఉంటారు. కానీ అది ఎప్పుడైనా నవ్వడం చూశారా..! చూడకపోతే ఇప్పుడు చూడండి. 'ది రెప్టైల్ జూ' తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Albino
uppula Raju
|

Updated on: Nov 03, 2021 | 3:07 PM

Share

Viral Video: మీరు ఎప్పుడో ఒకసారి మొసలిని చూసే ఉంటారు. కానీ అది ఎప్పుడైనా నవ్వడం చూశారా..! చూడకపోతే ఇప్పుడు చూడండి. ‘ది రెప్టైల్ జూ’ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నవ్వుతున్న మొసలి వీడియో వీడియోను షేర్ చేసింది. వీడియోలో కోకోనట్ (మొసలి పేరు) వెన్నుపై ఒక యువతి బ్రష్ తో రుద్దుతుంటే స్మైల్‌ ఇస్తుంది. ఈ సమయంలో మొసలి హావాభావాలు చూస్తే నవ్వొస్తుంది.

ఒక యువతి బ్రష్ సహాయంతో కొకోనట్‌ వెనుక భాగాన్ని శుభ్రం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అయితే జూ సిబ్బంది కోకోనట్‌కి ఒక రకమైన అలెర్జీ ఉందని ఆమె అతనికి రోజూ స్నానం చేసి ఆపై స్క్రబ్ సెషన్ ఇస్తుందని చెప్పారు. అయితే ఆ యువతి కోకోనట్‌ వెనుక భాగాన్ని బ్రష్‌తో శుభ్రం చేస్తుండగా మొసలి నవ్వుతూ కనిపించడం మనం వీడియోలో గమనించవచ్చు. ‘ది రెప్టైల్ జూ’ ఈ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ‘కోకోనట్ స్క్రబ్ సెషన్‌ను ఇష్టపడుతుంది’ అని రాశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 70 వేల మంది లైక్ చేశారు. అదే సమయంలో వందల మంది ప్రజలు దీనిపై కామెంట్‌ చేశారు. ఒక వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ.. కోకోనట్‌ చిరునవ్వు చాలా మధురమైనది అని రాశారు. స్క్రబ్ సమయంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతమన్నారు. మరొక వినియోగదారు ఇలా రాశారు.. నేను ఇంతవరకు మొసలి నవ్వడం చూడలేదన్నారు. ఇది నిజంగా అద్భుతమైన దృశ్యమని వ్యాఖ్యానించారు. చాలామంది మొసలి నవ్వును అందమైనది, ఆశ్చర్యమైనదని చెబుతున్నారు.

Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Puneeth Raj Kumar: రాబంధులను మించిపోయారు.. పునీత్ హఠాన్మరణాన్ని బిజినెస్‌కు వాడుకుంటున్న ఆసుపత్రులు..

Jammu Kashmir: పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. దురదృష్టకరమన్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా