AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటలురాని తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తోన్న చిన్నారి.. కూతురంటే కొండంత అండే..

తండ్రికి తన కూతురు మరో అమ్మ.. ఆ కూతురుకి తండ్రే ప్రపంచం. తండ్రి కూతురు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకనే చాలా మంది డాడీ పెట్ అని .. ప్రిన్సెస్ అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. అటువంటి తండ్రి కూతురు బంధం గురించి తెలియజేస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో మాటలు రాని తన తండ్రికి వ్యాపారంలో ఒక చిన్నారి సహాయం చేస్తోంది. ఈ హృదయాన్ని తాకుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాటలురాని తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తోన్న చిన్నారి.. కూతురంటే కొండంత అండే..
Viral Video
Surya Kala
|

Updated on: Oct 21, 2025 | 1:55 PM

Share

ఒక తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది. తండ్రి మాత్రం ఈ బిడ్డని జీవితాంతం మోస్తాడు. తన భుజాలపై కూర్చొని ప్రపంచాన్ని చూపిస్తాడు. ఇక కుతురికైతే తండ్రి ఒక బ్రెస్ట్ ఫ్రెండ్. తండ్రే మొదటి హీరో. తండ్రి, కుమార్తె మధ్య అందమైన బంధానికి సాక్ష్యమిచ్చే అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తునే ఉంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్ళు తడిసిపోతాయి. మాట్లాడలేని తండ్రికి, అతని కూతురే సర్వస్వం. జీవనోపాధి కోసం ఒక చిన్న దుకాణం నడిపే తండ్రి మాట్లాడలేడు. కూతురు తన తండ్రికి తోడుగా ఉండి అతని వ్యాపారంలో అతనికి మద్దతు ఇస్తుంది. కూతురు తండ్రి గొంతుక అయింది. ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తున్న కూతురు అడ్వాన్స్ హోమి దేవాంగ్ కపూర్ (@Homidevang31) మాటలు రాని తన మూగ తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తున్న కూతురు వీడియోను షేర్ చేసింది. వీడియో శీర్షిక తండ్రి మూగవాడు.. అతని కుమార్తె ప్రతిరోజూ దుకాణం నడుపుతూ అతనికి సహాయం చేస్తుందని చెబుతోంది. పానిపట్ లోని పాత బస్ స్టాండ్, సుఖ్‌దేవ్ నగర్ గేట్ 1 దగ్గర, పర్వీన్ మెడికల్ ఎదురుగా, మీరు సమీపంలో ఉంటే.. ఈ తండ్రి కూతురు షాప్ దగ్గర ఏదైనా కొనండి..మీ చిన్న సహాయం ఆ కుటుంబానికి చాలా సహాయం అవుతుందని కామెంట్ జత చేశారు ఈ వీడియోకి

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

ఈ వీడియోలో ఒక కూతురు మాటలు రాని తన తండ్రితో సంజ్ఞా భాషలో సంభాషిస్తుంది. ఇది రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఇంటి అలంకరణ స్టాల్. ఇక్కడ తండ్రి, కుమార్తె ఇద్దరూ కూర్చుని దుకాణాన్ని చూసుకుంటున్నారు. అయితే కూతురు తన తండ్రికి కస్టమర్లు స్టాల్‌కు వచ్చి ఏదో అడుగుతున్నారని సంజ్ఞా భాషలో వివరించింది. కస్టమర్లు కొన్ని వస్తువులను తక్కువ ధరకు అడిగారు.. అప్పుడు ఆ విషయాన్ని కుమార్తె తన తండ్రికి వివరించింది. అపుడు ఆ తండ్రి తన కుమార్తెకు వాటిని అంత తక్కువ ధరకు ఇవ్వలేనని సంజ్ఞా భాషలో వివరించడాన్ని మీరు చూడవచ్చు.

అక్టోబర్ 19న షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా వీక్షించారు.”లక్ష్మీదేవి ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ఒకరు, వారి జీవితం శ్రేయస్సు , ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.” మరొకరు, “తండ్రీకూతుళ్ల బంధం చాలా అందంగా ఉంది, హృదయానికి చాలా దగ్గరగా ఉంది. వారి వ్యాపారం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.. “ఈ వీడియో చాలా మధురంగా ​​ఉంది. ఆమె నిజంగా తన తండ్రిని గర్వపడేలా చేస్తుంది అని ఇలా రకరకాలుగా తండ్రి కుతురు ప్రేమ గురించి కామెంట్స్ చేస్తూ వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..