AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఐదు పాములు ఇవే.. కాటు వేస్తే కాటికే..

సృష్టిలోని అనేక జీవుల్లో ఒకటి పాములు. ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నాయి. కొన్ని విషం లేనివి కాగా.. కొన్ని అత్యంత విషపూరితమైనవి. కొన్ని రంగురంగులతో అందంగా కనిపిస్తాయి. ప్రపంచంలో దాదాపు 3,000 రకాలకు పైగా పాములున్నాయి.. వాటిల్లో 15 శాతం మాత్రమే విశాపూరితమైన పాములు. ఈ విషం ఉన్న పాముల్లో కూడా సుమారు 150 జాతులు మనుషులను చంపెంత శక్తిని కలిగి ఉన్నాయి. ప్రపంచంలో పది అత్యంత విషపూరితమైన పాములు ఏమిటో తెలుసా

Surya Kala
|

Updated on: Oct 21, 2025 | 1:26 PM

Share
పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతాం.. అయితే స్వతహాగా పాములు మనుషులకు శత్రువులు కావు. మన అవగాహనా లేమి, అజాగ్రత్త కారణంగానే పాములు మనుషులకు శత్రువులుగా మరాతాయి. వాస్తవానికి ప్రపంచంలో పాములు ప్రకృతి లోని అద్భుత సృష్టి. వీటి విషం ప్రాణాలను తీయగలదు.. అదే సమయంలో వీటి విషం ఔషధంగా మారి ప్రాణాలను పోయగలదు. అందుకనే పాము విషం ఖరీదైంది కూడా.. అటువంటి పాముల్లో కొన్ని రకాల పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. ఈ రోజు ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఐదు పాముల గురించి ఈ రోజు తెల్సుకుందాం..

1 / 6
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక విషం కలిగిన పాము ఇన్‌లాండ్ తైపాన్. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మహా సిగ్గరి ఈ పాము అందుకనే మట్టిలో లోతైన బొరియల్లో దాగుంటుంది. ఈ పాము అంటే శాస్త్రవేత్తలకు అపారమైన గౌరవం. ఎందుకంటే దీని ఒక్క కాటులో  110 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక్క కాటుతో వెదజల్లే విషంతో వందల మంది మరణిస్తారు. 2,50,000 ఎలుకలను చంపవచ్చు. ఈ పాము విషంలో హైరోనిడేస్(Hyaluronidase) అనే ఎంజైమ్ ఉంటుంది. అందుకనే ఇది కాటు వేసిన వెంటనే శరీరంలోకి రెప్ప పాటులో వ్యాపిస్తుంది. నిమిషాల్లోనే మరణం సంభవించే అవకాశం ఉంది.

2 / 6
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదరకారి పాము ఇసుక పింజర. ఇది చూడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే అత్యంత ప్రమాదకారి. మన దేశంలో బిగ్ ఫోర్ పాముల్లో ఒకటి... ఎక్కువ మరణాలకు కారణం కూడా ఈ ఇసుక పింజరే. ఈ పాము కాటు వేస్తే మూత్రపిండాల వైఫల్యం ,  అంతర్గత రక్తస్రావం జరిగి మరణిస్తారు.

3 / 6
ప్రపంచంలో మూడవ అత్యంత విషపూరితమైన పాము కోస్టల్ తైపాన్. ఇది కూడా ఆస్ట్రేలియాలోని తీరప్రాంతాల్లో కనిపించే ఒక పెద్ద పాము. దీనికి వేడి అంటే ఎక్కువ ఇష్టం. అందుకనే ఎక్కువగా జన సంచారం ఉన్న చోట్ల నివసిస్తుంది. ఉష్ణమండల వర్షారణ్యాలు, గడ్డి పొలాలు, చెరకు పొలాలు మొక్కల పొదల్లో వంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇది కాటు వేస్తే న్యూరోటాక్సిన్లు నెమ్మదిగా శరీరాన్ని అపస్మార స్థితికి నెడతాయి. దీని విషం చాలా శక్తివంతమైనది. ఒక కాటుతో దాదాపు 400 మందిని చంపేంత విషం విడుదల చేయగలదు.

4 / 6
బ్లాక్ మాంబా: 

ఆఫ్రికాలోని పచ్చిక మైదానాల్లో కనిపించే బ్లాక్ మాంబాలు పిల్లలు అయితే లేత రంగులో ఉంటాయి. ముదురు పాములు ముదురు రంగులో ఉంటాయి. అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు  గంటకు 19 కిమీ వేగంతో కదిలే భయంకరమైన పాము. పాములను పట్టుకునే వారు కూడా పట్టుకోవడానికి బయపడే పాము ఈ బ్లాక్ మాంబా.. ఎంత సన్నని రంద్రంలోకి అయినా వేల్లిపోగలదు. వరసగా ఎన్ని సార్లు అయినా కాటు వేయగలదు. దీని కాటు తో అఫ్రియాలో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది మరణిస్తున్నారు.

బ్లాక్ మాంబా: ఆఫ్రికాలోని పచ్చిక మైదానాల్లో కనిపించే బ్లాక్ మాంబాలు పిల్లలు అయితే లేత రంగులో ఉంటాయి. ముదురు పాములు ముదురు రంగులో ఉంటాయి. అత్యంత విషపూరితమైన పాము మాత్రమే కాదు గంటకు 19 కిమీ వేగంతో కదిలే భయంకరమైన పాము. పాములను పట్టుకునే వారు కూడా పట్టుకోవడానికి బయపడే పాము ఈ బ్లాక్ మాంబా.. ఎంత సన్నని రంద్రంలోకి అయినా వేల్లిపోగలదు. వరసగా ఎన్ని సార్లు అయినా కాటు వేయగలదు. దీని కాటు తో అఫ్రియాలో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది మరణిస్తున్నారు.

5 / 6
కట్లపాము.. కోబ్రా జాతికి చెందిన భయంకరమైన పాము. మన దేశంలో కనిపించే సాధారణ ఈ కట్ల పాము ప్రపంచంలో ఐదవ విషపూరితమైన పాము.  మన దేశంలో బిగ్ ఫోర్ పాముల్లో ఒకటి ఇది ఒకటి. రాత్రి సమయంలో ఆహార అన్వేషణకు బయటకు వస్తుంది. మగ పాము కంటే ఆడ పాము   అత్యంత విషపూరితమైన సర్పం. ఈ పాము విషం నాగు పాము కంటే 16 రెట్లు విషపూరితమైనది. కాటు వేస్తే కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో, జనావాసము లేని పరిసరప్రాంతాలలో నివసిస్తుంది. ముఖ్యంగా ఎలుకలు,  పందికొక్కులున్న చోట కట్ల పాము ఎక్కువగా కనిపిస్తుంది.

6 / 6