AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోనే రిచెస్ట్‌ విలేజ్‌‌.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు

దేశంలోనే రిచెస్ట్‌ విలేజ్‌‌.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 2:53 PM

Share

గుజరాత్ లోని ధర్మజ్ అనే గ్రామం దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా పేరు పొందింది. ఇక్కడి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా విదేశాల్లో స్థిరపడ్డారు. బ్రిటన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో నివసిస్తున్నా, తమ మూలాలను మర్చిపోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ గ్రామం సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విలాసవంతమైన బంగ్లాలు, ఖరీదైన కార్లతో నగరాన్ని కూడా తలదన్నే విధంగా ఉంటుంది.

ఈ గ్రామాన్ని ముద్దుగా ఎన్ఆర్ఐ విలేజ్ అఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం నుంచి 1700 కుటుంబాలు బ్రిటన్‌కు,అలాగే 800 కుటుంబాలు అమెరికాకు, 300 కుటుంబాలు కెనడా, 150 కుటుంబాలు ఆస్ట్రేలియాతో పాటు న్యూజీలాండ్, ఆఫ్రికా వంటి దేశాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామంలోని ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లున్నాయి. ఈ గ్రామంలో 1972 నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. నగరవాసులు కూడా ఆశ్చర్యపడే విధంగా ఈ గ్రామంలో అనేక పెద్ద పెద్ద బంగ్లాలుండగా.. వాటి ముందు నిలిపిన మెర్సిడెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు దర్శనమిస్తాయి. గ్రామంలో పార్కులు, స్విమింగ్ పూల్స్, బోటింగ్,అనేక పండ్ల తోటలు కూడా ఉంటాయి. మొత్తం 17 హెక్టార్స్ లో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 11,333 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకుల 11 శాఖలున్నాయి. ఈ అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం రూ. 1000 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. 1959 లోనే దేనా బ్యాంకు తమ మొదటి బ్యాంకు బ్రాంచ్ ని ఇక్కడ ప్రారంభించింది. 1895వ సంవత్సరం నుంచి ఈ గ్రామం సంపన్నుల గ్రామంగా మారుతూ వచ్చింది. ఆ ఏడాది.. ఈ గ్రామానికి చెందిన జోతారామ్ కాశీరామ్ పటేల్, చతుర్బయ్ పటేల్ వంటి వారు ఆఫ్రికాలోని ఉగాండాకి వెళ్లి..అక్కడే స్థిరపడ్డారు. అనంతరం ప్రభుదాస్ పటేల్ వంటి వారు యూరప్‌లోని మాంచెస్టర్ లో స్థిరపడి మాంచెస్టర్ వాలా అని పేరు పొందారు. అనంతరం గోవింద్ భాయ్ పటేల్ ఆడెన్ కి వెళ్లి అక్కడ పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా ఈ గ్రామానికి చెందిన ఒక్కొక్కరూ ఇతర దేశాలకు వెళ్లి అక్కడ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. భారత మాజీ ఆర్థిక మంత్రి హెచ్ఎం పటేల్ కూడా ఈ ఊరి వాడే. జీవితంలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో.. ఏటా జనవరి 12న ధర్మజ్ దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ రోజును ప్రపంచం నలుమూలల నుంచి ఆ ఊరివారు అక్కడికి వచ్చి.. నాలుగు రోజులు గడిపి తిరిగి వెళుతుంటారట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్

మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??

మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్‌ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!