తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్
కింగ్ వారసుడిగా... గుర్తింపు! గుడ్ లుక్స్! పైగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో స్టార్ ప్లేయర్. దీంతో సినిమాల్లోకి రాకముందే క్రేజ్‌ను.. తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించున్నాడు అఖిల్. ఆ తర్వాత సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు కానీ... సూపర్ డూపర్ హిట్ సినిమాలను డెలివరీ చేయలేకపోయాడు. స్టోరీ సెలక్షన్స్లో తప్పటడుగులు వేశాడు.
అంతేకాదు తన రీసెంట్ ఫిల్మ్ ఏజెంట్ రిజెల్ట్‌తో దారణంగా ట్రోల్ అయ్యాడు. ఇక ఏజెంట్ సినిమా దెబ్బతో సినిమాల్లో కాస్త గ్యాబ్ తీసుకున్న అఖిల్.. రీసెంట్‌గా లెనిన్ మూవీ చేస్తున్నాడు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో బయటికి వచ్చిన న్యూస్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే… శ్రీకాంత్ ఓదెల డెబ్యూ మూవీ దసరా సినిమాలో.. అఖిల్ అక్కినేనే మొదట హీరోనట. ఈ స్టోరీని రాసుకున్న ఓదెల.. మొదట అఖిల్ దగ్గరకే తన స్క్రిప్ట్‌ను తీసుకెళ్లాడట. కానీ పలు కారణాలతో అఖిల్ ఈ స్టోరీకి నో చెప్పాడట. దాంతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో నానిని హీరోగా ఎంచుకున్నాడు. సూపర్ డూపర్ హిట్టు మాత్రమే కాదు ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేసిన డైరెక్టర్‌గా మారిపోయాడు. ఈ ఒక్క సినిమానే కాదు.. అఖిల్ మరో హిట్టు సినిమాను కూడా మిస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో టాక్. కిరణ అబ్బవరం నటిచంన ‘క’ సినిమా స్టోరీ కూడా మొదట అఖిల్ దగ్గరకే వచ్చిందట. కానీ అఖిల్ ఎందుకోఆ సినిమా చేసేందుకు వెనకడుగు వేశాడట. దీంతో ఆ సినిమా కిరణ్ చేతుల్లోకి వెళ్లింది. ఇలా అఖిల్ సినిమా సెలెక్షన్స్‌లో తప్పటడుగులు వేసి.. కెరీర్‌లో సక్సెస్‌కు దూరమయ్యాడని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అసలే కెరీర్ అంతంత మాత్రం అంటే… అందులో సూపర్ హిట్టు సినిమా మిస్ చేసుకుంటే ఎలా అఖిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??
మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!

