AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 2:17 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సబంధం లేకుండా అనేక రోగాల బారిన పడుతున్నారు. కొందరు యువత గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతుంటే.. మరికొందరు క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. యుక్త వయసులోనే పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కొత్త అధ్యయనం అత్యంత కీలక విషయాన్ని బయటపెట్టింది.

50 ఏళ్లలోపు వయసు వారిలో మలద్వారం నుంచి రక్తస్రావం కావడం అనేది పెద్దపేగు క్యాన్సర్‌కు అత్యంత బలమైన సంకేతమని పరిశోధకులు తేల్చారు. ఈ లక్షణం ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే ఏకంగా 8.5 రెట్లు అధికంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2021 నుంచి 2023 మధ్య కొలొనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న 50 ఏళ్ల లోపు వయసున్న 443 మంది రోగుల వైద్య రికార్డులను వారు విశ్లేషించారు. వీరిలో దాదాపు సగం మందికి చిన్న వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ ఉన్న రోగుల్లో 88 శాతం మంది మలంలో రక్తం వంటి లక్షణాలతోనే వైద్యులను సంప్రదించినట్లు తేలింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లూయిస్‌విల్లే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ సాండ్రా కవలుకాస్ ఏం చెప్పారంటే.. “చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న చాలా మందికి కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేదన్నారు. స్క్రీనింగ్ వయసు కంటే తక్కువ వయసున్న వారిలో మలంలో రక్తం కనిపిస్తే, వారికి తప్పనిసరిగా కొలొనోస్కోపీ చేయించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి” అని సూచించారు. సాధారణంగా కుటుంబ చరిత్ర లేదా జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ వస్తుందని భావిస్తారు. అయితే, ఈ అధ్యయనంలో కేవలం 13 శాతం కేసుల్లో మాత్రమే జన్యుపరమైన మార్పులు కనిపించాయి. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల ముప్పు కేవలం రెండు రెట్లు మాత్రమే పెరుగుతుందని తేలింది. అదే సమయంలో, గతంలో ధూమపానం చేసిన వారిలో క్యాన్సర్ ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కుటుంబ చరిత్ర లేనివారు 45 ఏళ్ల నుంచి పెద్దపేగు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Sweets: దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్‌ లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా..?

నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా