కార్వాన్ నావల్ బేస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు
ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు ఒకేసారి త్రివిధ దళాల దెబ్బ రుచి చూపించాయి అన్నారు ప్రధాని మోదీ. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అన్నారు. - గోవా నేవల్ బేస్‌లోని INS విక్రాంత్ యుద్ధనౌకలో నేవీతో కలిసి మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. త్రివిధ దళాల సమన్వయమే పాకిస్థాన్‌ను కాళ్ల బేరానికి తీసుకొచ్చాయని ప్రధాని మోదీ అన్నారు.
ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు ఒకేసారి త్రివిధ దళాల దెబ్బ రుచి చూపించాయి అన్నారు ప్రధాని మోదీ. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అన్నారు. – గోవా నేవల్ బేస్‌లోని INS విక్రాంత్ యుద్ధనౌకలో నేవీతో కలిసి మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. త్రివిధ దళాల సమన్వయమే పాకిస్థాన్‌ను కాళ్ల బేరానికి తీసుకొచ్చాయని ప్రధాని మోదీ అన్నారు. కార్వాన్ నేవల్ బేస్‌లో కూడా దీపావళి వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రక్షణరంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు అత్యంత ప్రాధానత్య ఇస్తున్నామన్నారు. INS విక్రాంత్ శత్రువులు గుండెల్లో గుబులు రేపిందన్నారు. INS విక్రాంత్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. నావికులతో దీపావళి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా తాను దీపావళి వేడుకలను వీరజవాన్ల తోనే జరుపుకుంటునట్టు మోదీ తెలిపారు. యుద్ధనౌకపై గడిపిన రాత్రి మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని, అది దేశభక్తి, గర్వంతో నిండిపోయిందని ప్రధాని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




