AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే...

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 3:03 PM

Share

ఆకుల్లో ఆకులా కలిసిపోయి.. పగలంతా హాయిగా నిద్రపోయి.. రాత్రి వేళ ఉత్సాహంగా వేటసాగించే ఈ పామును గుర్తు పట్టారా? అచ్చం పల్లెల్లో కనిపించే పసిరిపాములా ఉంటుంది. కానీ ఇది పసిరిక పాము కాదండోయ్‌. దీని పేరు స్పాట్‌ టెయిల్డ్‌ పిట్‌ వైపర్‌. ఈ పాము చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే కాటికి పోవాల్సిందే.

ఇది కూడా పసిరిక పాముల మాదిరిగా చెట్లపై ఉంటుంది. మడ అడవులు ఉండే ప్రాంతాల్లో అవాసం ఏర్పరుచుకుంటుంది. ప్రస్తుతం ఈ పాము అంతరించిపోయే దశలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్‌లో ఉండగా.. వాటి ఉనికిని కాపాడేందుకు 2022లో ఒకటో షెడ్యూల్‌లోకి మార్చారు. మామూలు పాములు చిత్తడి నేలల్లో ఎక్కువగా జీవనం సాగిస్తాయి. ఈ పాము కాటు పడితే.. లోపల బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ అవ్వడం, హార్ట్‌ అటాక్, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే ఈ పాములు సంతతి చాలా తక్కువగా ఉండటంతో.. ఇటీవలి కాలంలో అలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు. పొడ పాము జాతికి చెందిన ఈ పాములు పగటి పూట పూర్తిగా నిద్రలో ఉంటాయి, రాత్రి వేళ వేటకు బయలుదేరతాయి. పచ్చని చెట్లపై సంచరిస్తూ ఉండే వీటిని పసరిక పాములు అని లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఈ పాము కాకినాడ జిల్లా కోరింగ ఫారెస్ట్‌లో ఇలా చెట్టుపై ఆకుల మధ్య కలిసిపోయి కనిపించింది. ఈ జాతి మగపాములు 22.6 అంగుళాలు, ఆడ పాములు 41.1 అంగుళాలు పెరుగుతాయి. మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ పాము గురించి తెలుసుంటే మంచిది. పసరిక పాము అనుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ

దేశంలోనే రిచెస్ట్‌ విలేజ్‌‌.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు

తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్

మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??