టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ
స్కూల్స్, కాలేజీల్లో విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. .పరీక్షల అనంతరం ఎగ్జామ్ పేపర్లు దిద్దడం మరో ఎత్తు. ఎగ్జామ్ రాయడం విద్యార్ధులకు పరీక్ష అయితే ఆ పేపర్లు దిద్దడం టీచర్లకు అంతకు మించిన పరీక్ష అనే చెప్పాలి. ఇప్పుడు పరీక్షనుంచి ఉపాధ్యాయులకు పెద్ద రిలీఫ్ దొరికింది. కారణం కృత్రిమ మేధ. దాదాపు అన్ని రంగాల్లో అడుగు పెట్టిన ఈ ఏఐ... ఇప్పటి వరకూ విద్యార్ధులకు పాఠాలు మాత్రమే చెప్పింది.
కానీ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లను కూడా దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ శివరాంపల్లిలోని ఓ హైస్కూల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ టెక్నాలజీతో ఎగ్జామ్ పేపర్లను దిద్దుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పాఠశాలల్లో పరీక్ష పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులకు తలనొప్పిగా ఉండేది. ఎక్కువ సమయం పరీక్షా పేపర్లను దిద్దడానికే కేటాయించాల్సి వస్తుంది. నెల పరీక్షలు మొదలుకొని క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, వార్షికా పరీక్షలకు విద్యార్థులు రాసిన పేపర్లు దిద్దాలంటే ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మార్కె ట్లోకి www.grademe.ai.com అందుబాటు లోకి వచ్చింది. దీని ద్వారా తరగతిలో ఉండే 50 మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను రెండు నుంచి ఐదు నిమిషాల లోపు దిద్ది మార్కులు ఇచ్చే విధంగా ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. పరీక్ష పత్రాలను దిద్ది మార్కులు వేయడమే కాకుండా, ఆన్సర్ షీట్‌లోని తప్పులు? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా ఈ సాఫ్ట్‌వేర్ సూచిస్తుంది. దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థుల పరీక్ష పత్రాలను దిద్దడం ఈజీగా మారింది. విద్యార్థులకు ఇచ్చిన పరీక్ష పత్రాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థులు రాసిన జవాబు పత్రాన్ని ఫొటో తీసి అప్ లోడ్ చేస్తే ఒకటి నుంచి రెండు నిమిషాలలోపు జవాబు పత్రాన్ని కరెక్షన్ చేసి మార్కులు ఇస్తుంది. ఈ విధానం చాలా బాగుందని హైస్కూల్ యాజమాన్యం అంటోంది. అమెరికాకు చెందిన ఉదయ్ మెహతా సారధ్యంలో అర్వాంచ్ అనే కంపెనీ పేరుతో ‘గ్రేడ్ మీ ఏఐ’ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశారు. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా పరీక్ష పత్రాలను చాలా సులభంగా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో దిద్దవచ్చన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. ఇండియాలో కూడా గ్రేడ్ మీ ఏఐ’ను విస్తరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశంలోనే రిచెస్ట్ విలేజ్.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు
తప్పటడుగు.. 100కోట్ల హిట్ సినిమా మిస్సు ! పాపం అఖిల్
మీరు నీళ్లు నిలబడి తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??
మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

