AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: త్రివర్ణ పథాకాన్ని పెయింటింగ్‌ చేసిన కుక్క… శునకం దేశభక్తికి వావ్‌ అంటున్న నెటిజన్స్‌

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తిరుగుతున్న వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌కు పంపాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. సుప్రీం నిర్ణయాన్ని వ్యతికిస్తూ పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్థించినప్పటికీ, చాలా మంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలోని చాలా చోట్ల నిరసనగా కొవ్వొత్తుల...

Viral Video: త్రివర్ణ పథాకాన్ని పెయింటింగ్‌ చేసిన కుక్క... శునకం దేశభక్తికి వావ్‌ అంటున్న నెటిజన్స్‌
Dog Painting
K Sammaiah
|

Updated on: Aug 14, 2025 | 5:28 PM

Share

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తిరుగుతున్న వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌కు పంపాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. సుప్రీం నిర్ణయాన్ని వ్యతికిస్తూ పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్థించినప్పటికీ, చాలా మంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలోని చాలా చోట్ల నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనలు కూడా జరిగాయి. కొన్ని కుక్కల కారణంగా అన్ని కుక్కలకు ఇలా చేయడం సరైనది కాదని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇంతలో అలాంటి కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిని ప్రజలు దేశభక్తి కుక్క అని పిలుస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు సంతోషించారు.

నిజానికి ఈ కుక్క చాలా తెలివైనది. దాని నోటితో పెయింట్ చేయడం ద్వారా త్రివర్ణ జెండాను తయారు చేసింది. వీడియోలో కుక్క నోటిలో ఆకుపచ్చ పెయింట్ బ్రష్ పట్టుకుని తెల్ల కాగితంపై దానితో పెయింటింగ్‌ చేయడం మీరు చూడవచ్చు. దీని తర్వాత అది కాషాయ పెయింట్ బ్రష్ తీసుకొని తెల్ల కాగితంపై దాంతో పెయింట్‌ వేస్తుంది. అప్పుడు కుక్క యజమానురాలు వచ్చి దానిని కాగితంపై సరిచేస్తుంది. తద్వారా అది త్రివర్ణ జెండాలా కనిపిస్తుంది. ఇది పెయింటింగ్ ద్వారా మన త్రివర్ణ జెండాను తయారు చేసిన మొదటి భారతీయ కుక్క అని చెబుతారు.

వీడియోను చూడండి:

హృదయానికి హత్తుకునే షోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్స్‌ విభిన్నంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారుడు ‘బాగా చేసారు డాలీ. ఢిల్లీలో వీధి కుక్కలకు సహాయం చేయడానికి మరొక పెయింటింగ్ వేయండి’ అని రాశారు, మరొక వినియోగదారుడు ‘డాలీ తన మిగిలిన స్నేహితులు మన దేశంలో సురక్షితంగా ఉండాలనే ఆశతో జెండాపై పెయింట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. రోడ్లు ఖాళీగా ఉండకూడదనే ఆశతో’ అని రాశారు.

సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
అక్షరాల కీర్తనలతో భక్తి పారవశ్యాన్ని చాటుకున్న చిత్రకారుడు!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..!
థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..కోర్టు మెట్లెక్కుతారా
థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..కోర్టు మెట్లెక్కుతారా
బహుశా చరిత్రలో అత్యంత అందమైన దోపిడీ ఇదేనేమో!
బహుశా చరిత్రలో అత్యంత అందమైన దోపిడీ ఇదేనేమో!
ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ 7-సీటర్ కారు..బెస్ట్ మైలేజీ
ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ 7-సీటర్ కారు..బెస్ట్ మైలేజీ
చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!
చిన్న తప్పుతో 12 ఏళ్ల బాలుడి చేతిలో గుకేష్ ఘోర పరాజయం..!
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
కాలీఫ్లవర్ కొనడం ఒక కళ! పురుగులు లేని ఫువ్వును ఇలా గుర్తించండి..
కాలీఫ్లవర్ కొనడం ఒక కళ! పురుగులు లేని ఫువ్వును ఇలా గుర్తించండి..