AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బ్రహ్మంగారి కాల జ్ఞానంలో చెప్పింది ఇదేనా..! మనిషి ముఖంతో మేక పిల్ల జననం.. వింత చూసేందుకు ఎగబడిన జనం..

ఎక్కడ ఎటువంటి వింత సంఘటన జరిగినా వెంటనే పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాల జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటారు. బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతున్నాయి.. కలికాలం అంటే ఇదేకదా అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇటీవల భద్రాచలం జిల్లాలో ఒక చింత మొక్క తనంతట తాను తిరుగుతూ కనిపించింది. కాల జ్ఞానాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని మరచిపోక ముందే.. అంతకు మించిన వింత సంఘటన తమిళనాడులో జరిగింది. మేకకు మనిషిని పోలిన పిల్ల పుట్టింది. దీనికి సంబందించిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Viral News: బ్రహ్మంగారి కాల జ్ఞానంలో చెప్పింది ఇదేనా..! మనిషి ముఖంతో మేక పిల్ల జననం.. వింత చూసేందుకు ఎగబడిన జనం..
Goat With A Human Like Face
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 5:29 PM

Share

తమిళనాడులో ఒక వింత సంఘటన జరిగింది. కల్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌ పేట సమీపంలోని సేందమంగళం గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో మనిషిని పోలిన మేక జన్మించింది. గ్రామంలో రైతు ఆనందన్ మేకలను పెంచుతున్నాడు. అతను పెంచుతున్న మేకల్లో ఒక మేక మనిషిలాంటి ముఖ కవళికలతో చనిపోయిన పిల్లను ప్రసవించింది. ఇది చూపరులను ఆసక్తిగా ఆకర్షించింది. విస్మయన్ని కలిగించింది. చూపరుల్లో భయాన్ని రేకెత్తించింది. ఈ వింత మేక సంఘటనటో స్థానికులు రెండుగా చీలిపోయారు. కొందరు దీనిని దైవిక సంకేతంగా భావిస్తూ వ్యాఖ్యానించారు. మరికొందరు దీనిని చెడు శకునంగా చెబుతున్నారు, అయితే శాస్త్రీయ నిపుణులు ఈ మేక పిల్ల జననంపై మాట్లాడుతూ వైకల్యంతో అరుదైన జననం జరిగిందని చెబుతున్నారు.

38 ఏళ్ల నివాసి ఆనందన్ తన ఇంట్లో 20 కి పైగా మేకలను పెంచుతున్నాడు. అతని మేకలలో ఒకటి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మేక పిల్ల సాధారణంగా ఉంది. కానీ మరొకటి అసాధారణంగా ఉంది, మానవుని ముఖం తో ఉంది. అయితే అది చనిపోయి పుట్టింది.

మనిషిలా కనిపించే మేక పిల్ల జన్మించిందని వార్తలు చుట్టుపక్కల ప్రాంతంలో దవాలంలా వ్యాపించాయి. దీంతో ఆనందన్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. చనిపోయిన మేక పిల్లను చూసేందుకు ఎగబడ్డారు. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వింత మేక జననంపై స్థానికులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు ఇలాంటి జననాలను దైవిక సంకేతంగా లేదా దేవత అవతారంగా భావిస్తున్నారు. అంతేకాదు ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఒక వికృతమైన దూడ చనిపోయే పూజ చేశారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మరికొందరు దీనిని చెడు శకునం అని చెబుతున్నారు. ఇది సమాజానికి రాబోయే విపత్తును సూచిస్తుందని భయపడుతున్నారు. సెందమంగళం గ్రామస్తులు తమ గ్రామంలో ఏమి చెడు జరగనుందో అంటూ భయపడుతున్నారు.

శాస్త్రీయ నిపుణులు ఏమి చెబుతున్నారంటే ఈ మేక పిల్ల జననపై పశు వైద్యులు, శాస్త్రీయ నిపుణులు స్పందించారు. అతీంద్రియ శక్తి వాదన తప్పని.. ఈ మేక పిల్ల వైకల్యంతో పుట్టిందని చెప్పారు. దీనిని సైక్లోపియా అని పిలువబడే అరుదైన వైకల్యం అని చెప్పారు. అంటే పిండం ముఖంగా స్పష్టంగా అభివృద్ధి చెందదని అన్నారు.

ఈ పరిస్థితిలో పిండంలో అధిక ద్రవం నిలిచి తీవ్రమైన వాపుకు దారితీస్తుంది. అప్పుడు ముఖ లక్షణాలు వక్రీకరించి మానవునిలా కనిపిస్తుంది. జీవశాస్త్రపరంగా మనిషి ముఖంతో మేక జననం అసాధ్యమని నొక్కి చెప్పారు. అయితే చాలా మంది స్థానికులు తమ ఆధ్యాత్మిక నమ్మకాన్నే విశ్వసిస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..