AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి ముందు మనిషి వామనుడే.. తుఫాన్‌కు గొడుగుతో సహా ఎగురుతున్న వ్యక్తి.. ఫన్నీ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బలమైన తుఫానులో తమని, తమ వస్తువులను రక్షించుకోవడానికి ఒక కుటుంబం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద గొడుగును పట్టుకున్నాడు. అయితే అప్పుడు వీచిన బలమైన గాలి కారణంగా..గొడుగుతో పాటు ఎగిరిపోయాడు. ఈ ఘటన మొత్తం ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ప్రకృతి ముందు మనిషి వామనుడే.. తుఫాన్‌కు గొడుగుతో సహా ఎగురుతున్న వ్యక్తి.. ఫన్నీ వీడియో వైరల్..
Man Flying With TentImage Credit source: Instagram/@weatherchannel
Surya Kala
|

Updated on: Jun 08, 2024 | 12:08 PM

Share

తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తుఫాన్, సునామీ వంటివి అనూహ్యంగా వస్తాయి. ఇవి ప్రమాదకరమైనవి కూడా. తుఫాన్, వరదలు, సునామీ వంటి వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరుగుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో విచిత్ర సంఘటనలు జరిగి వార్తల్లో నిలుస్తాయి. తాజాగా చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ఫాంగ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి బలమైన గాలులకు చిక్కుకుని పెద్ద గొడుగుతో పాటు గాలిలోకి ప్లయింగ్ సాసర్ లా ఎగురుతున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బలమైన తుఫానులో తమని, తమ వస్తువులను రక్షించుకోవడానికి ఒక కుటుంబం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద గొడుగును పట్టుకున్నాడు. అయితే అప్పుడు వీచిన బలమైన గాలి కారణంగా..గొడుగుతో పాటు ఎగిరిపోయాడు. ఈ ఘటన మొత్తం ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagramలో @weatherchannel అధికారిక ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఒక వ్యక్తి భారీ గొడుగును ఎగిరిపోకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు.. అప్పుడు వీచిన బలమైన గాలి గొడుగుతో పాటు వ్యక్తిని కూడా ఎగరేసుకుని తీసుకుని పోయింది అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో చైనాలో జరిగిన ఈ ఘటన స్పష్టం చేసింది. అలాగే ఇటువంటి సంఘటనల నుంచి మనం పాఠాలు నేర్చుకోవడంతో పాటు.. భవిష్యత్తులో సురక్షితమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

కేవలం కొన్ని సెకన్ల ఈ వీడియోను చూసిన తర్వాత రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు దీనిని వినోదభరితంగా, ఫన్నీగా భావించారు. మరికొందరు పరిస్థితిని తీవ్రంగా తీసుకున్నారు. ఒకరు ఈ వీడియో క్లిప్ చూసినప్పటి నుంచి నేను నవ్వడం ఆపలేదు. అదే సమయంలో ఇది ఏ కోణంలో చూసినా ఫన్నీగా అనిపించడం లేదు మరొకరు చెప్పారు. అయితే ఆ వ్యక్తి తన గొడుగుతో పాటు ఎగిరిపోయిన తీరు చూసి నాకు భలే నవ్వు వచ్చింది. ప్రకృతి ముందు మనిషి మనుగడ సాగించడం కష్టమని మరొకరు రాశారు. ప్రకృతితో పోరాటం చేయడానికి ప్రయత్నించకూడదు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..