Fast Food Effects: ఇష్టమని ఫాస్ట్ ఫుడ్‌ని తెగ తినేస్తున్నారా.. ఈ వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నట్లే హెచ్చరిస్తున్న నిపుణులు

ఫాస్ట్ ఫుడ్ తినడం వలన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అనారోగ్యం బారిన పడుతున్నాం అని తెలిసినా ప్రజలు వాటిని తినడం మానడం లేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీ రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మధుమేహం, ఊబకాయం, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ లో సోడియం, షుగర్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ తక్కువగా ఉంటాయి..

Fast Food Effects: ఇష్టమని ఫాస్ట్ ఫుడ్‌ని తెగ తినేస్తున్నారా.. ఈ వ్యాధులకు వెల్కమ్ చెబుతున్నట్లే హెచ్చరిస్తున్న నిపుణులు
Fast Food Side Effects
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2024 | 11:47 AM

ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ ను అందరూ దీన్ని ఇష్టపడి తింటున్నారు. బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ ను తెగ లాగించేస్తున్నారు. అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ తినడం వలన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అనారోగ్యం బారిన పడుతున్నాం అని తెలిసినా ప్రజలు వాటిని తినడం మానడం లేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీ రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మధుమేహం, ఊబకాయం, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్ లో సోడియం, షుగర్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని రోజూ లేదా ఎక్కువ మొత్తంలో తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్‌లో సోడియం ఉంటుంది. చక్కెర స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది.

ఫాస్ట్ ఫుడ్ లో కెమికల్స్ ఫాస్ట్ ఫుడ్ లో అనేక రకాల కెమికల్స్ వాడతారని ఢిల్లీలోని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ రసాయనాలు శరీరంలో మంచి బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇవి గట్ మైక్రోబయోమ్ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు, శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. దీని వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ 2018లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. కొన్ని దశాబ్దాలుగా ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులకు సాధారణ వ్యక్తుల కంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. భారత్‌లోనూ ఫాస్ట్‌ఫుడ్‌ ట్రెండ్‌ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎక్కువ మంది తీసుకునే ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది.

ఎంత ఫాస్ట్ ఫుడ్ తినాలి

ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అయితే తక్కువ మోతాదులో తింటే పెద్దగా నష్టం వాటిల్లదని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగంలో హెచ్ ఓడీ డాక్టర్ వినీత్ తల్వార్ చెబుతున్నారు. అంటే నెలకు ఒకటి లేదా రెండుసార్లు తినవచ్చు. ఈ పరిస్థితిలో ఇది హాని కలిగించదు. అయితే అంతకంటే ఎక్కువగా తింటే ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!