Viral Video: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఏగ్జామ్.. నవ వధువు పెళ్లి దుస్తుల్లో పరీక్షకు హాజరు..

కొత్త పెళ్లికూతురు ప్రాక్టికిల్ ఎగ్జామ్స్‌కు హాజరైంది. ఈమెను పెళ్లిదుస్తుల్లో చూసిన క్లాస్‌మేట్స్ ఆనందంతో స్వాగతం పలికారు. పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన ఈ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఏగ్జామ్.. నవ వధువు పెళ్లి దుస్తుల్లో పరీక్షకు హాజరు..
Kerala Bride
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2023 | 9:29 AM

కేరళలో ఓ వధువు పెళ్లి దుస్తుల్లో పరీక్షకు హాజరైంది. శ్రీ లేక్ష్మి అనిల్ అనే యువతి బెథానీ నవజీవన్ పిజియోథెరపీ కాలేజీలో చదువుతోంది. పెళ్లి రోజే ఫిజియోథెరపీ ప్రాక్టికల్ ఏగ్జామ్ ఉండటంతో పెళ్లి మండపం నుంచి నేరుగా పరీక్ష హాల్‌కు వెళ్లింది. పుసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతో పాటు ఆప్రాన్‌ ధరించి మెడకు స్టెతస్కోప్ వేసుకుని ఈ కొత్త పెళ్లికూతురు ప్రాక్టికిల్ ఎగ్జామ్స్‌కు హాజరైంది. ఈమెను పెళ్లిదుస్తుల్లో చూసిన క్లాస్‌మేట్స్ ఆనందంతో స్వాగతం పలికారు. పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన ఈ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెడికోస్ లైఫ్.. ఒకేరోజున ప‌రీక్ష..పెండ్లి అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వీడియో వైరల్ 

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ????_????? (@_grus_girls_)

తెల్లటి ల్యాబ్ కోట్ ధరించి, ప్రాక్టికల్ పరీక్ష కోసం స్టెతస్కోప్‌ని తీసుకువెళుతున్న వధువు పెండ్లితో పాటు కెరీర్‌కూ స‌మంగా ప్రాధాన్యత ఇచ్చింద‌ని న‌వ వ‌ధువును ప‌లువురు ప్రశంసించారు. పెండ్లితో త‌మ కెరీర్ ముగిసింద‌ని అనుకునే వారంద‌రికీ న‌వ వ‌ధువు క‌నువిప్పు క‌లిగించార‌ని మరికొందరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..