AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఛీ ఛీ వీళ్లు మనుషులేనా.. పెళ్ళిలో పన్నీర్ కోసం గొడవ.. కర్రలతో దాడి.. పగిలిన బుర్రలు

చూస్తుండగానే వివాదం పెద్దదై.. కర్రలను తీసుకుని ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ కు చేరుకుంది. అంతే పెళ్లికి వచ్చిన ఆహుతులు ఒక్కసారిగా భయంతో పెళ్లి వేదిక నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ గొడవ ఎందుకు జరిగిందో తెలిస్తే.. అసలు వీళ్ళు మనుషులేనా అంటారు ఎవరైనా.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

Viral Video: ఛీ ఛీ వీళ్లు మనుషులేనా.. పెళ్ళిలో పన్నీర్ కోసం గొడవ.. కర్రలతో దాడి.. పగిలిన బుర్రలు
Wedding Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2023 | 8:47 AM

భారత దేశంలో జరిగే వివాహాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పెళ్లిళ్లు…  సంప్రదాయాలు, వేడుకలు, అలంకారాలు,  బంధువులు, స్నేహితుల కోలాహలాలు.. చిన్న చిన్న అలకలతో జీవితాంతం ఓ అందమైన జ్ఞాపకంగా జరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలో వరుడు.. వరుడు కుటుంబ సభ్యులు చూపించే ఠీవి వెరీ వెరీ స్పెషల్. పెళ్లి సమయంలో వరుడు అలిగి కాశీకి పయనం అవుతాను అని అంటే.. పెళ్లి కూతురు అన్నదమ్ములు తమ  కాశీకి వెళ్లొద్దు అక్కని పెళ్లి చేసుకో బావా అంటూ బతిమిలాడి సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే ఇవన్నీ వివాహ తంతులో ఒక భాగమే.. అయితే పెళ్ళిలో జరిగిన చిన్న చిన్న లోపాలను పట్టుకుని గొడవలు పడి కొట్టుకుంటున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

పెళ్లి వేడుక మొదలైంది. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కలకలం రేగింది.  వరుడు, వధువు కుటుంబసభ్యుల మధ్య గొడవ మొదలైంది. చూస్తుండగానే వివాదం పెద్దదై.. కర్రలను తీసుకుని ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ కు చేరుకుంది. అంతే పెళ్లికి వచ్చిన ఆహుతులు ఒక్కసారిగా భయంతో పెళ్లి వేదిక నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ గొడవ ఎందుకు జరిగిందో తెలిస్తే.. అసలు వీళ్ళు మనుషులేనా అంటారు ఎవరైనా.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ఇవి కూడా చదవండి

పెళ్లి విందులో పనీర్ లేనందుకు వరుడు కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది. భోజనం వడ్డిస్తున్న యువకులతో వాగ్వాదానికి దిగడంతో ఈ వ్యవహారం మొదలైంది. పనీర్ వడ్డించ లేదని వరుడి కుటుంబసభ్యులు ఆగ్రహంతో వధువు కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. వధువు తరపు బంధువులు ఎంతగా బతిమాలినా వరుడు తరపు వారు శాంతించలేదు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇరువర్గాల వారు కర్రలు, బెల్టులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో జనం గుమిగూడారు.

గొడవ అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఇరువర్గాల పై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. గొడవ జరిగిన సమయంలో ఎవరో మొబైల్ నుంచి వీడియో తీసి ఇంటర్నెట్ మీడియా షేర్ చేశారు. పెళ్ళి విందులో చాల రకాల వంటకాలు ఉంటాయిగా పన్నీర్ కోసం ఇంతగా గొడవపడాలా అని విస్తుపోతున్నారు. అసలు వీళ్లు మనుషులేనా? అని మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. చీకట్లో జనం!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా