Kashmir: మంచు వర్షంలో బ్యాటింగ్ చేసిన మంత్రి అనురాగ్ ఠాకూర్.. నేటి నుంచి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌

శ్వేత వర్ణపు మంచు కనువిందు చేస్తోంది. తంగ్‌మార్గ్‌లో జరిగిన మంచు క్రికెట్ మ్యాచ్‌లో ఠాకూర్ పాల్గొన్నారు. అక్కడ అతనికి ఘనమైన సంప్రదాయ స్వాగతం లభించింది.

Kashmir: మంచు వర్షంలో బ్యాటింగ్ చేసిన మంత్రి అనురాగ్ ఠాకూర్.. నేటి నుంచి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌
Anurag Thakur Plays Cricket
Follow us

|

Updated on: Feb 10, 2023 | 8:13 AM

జమ్మూకశ్మీర్ లో మంచు వర్షం కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్  స్థానికులతో కలిసి సందడి చేశారు. ఓ వైపు మంచు వర్షం కురుస్తుంటే.. మరోవైపు హ్యాపీగా ఆ హిమపాతాన్ని ఎంజాయ్ చేస్తూ..  క్రికెట్ ఆడారు. అనురాగ్ ఠాకూర్ చిన్నపిల్లాడిలా మారి.. క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో శ్వేత వర్ణపు మంచు కనువిందు చేస్తోంది. తంగ్‌మార్గ్‌లో జరిగిన మంచు క్రికెట్ మ్యాచ్‌లో ఠాకూర్ పాల్గొన్నారు. అక్కడ అతనికి ఘనమైన సంప్రదాయ స్వాగతం లభించింది. ఠాకూర్ భారీ హిమపాతం కురుస్తున్న సమయంలో బ్యాటింగ్ చేస్తూ… సిక్స్ కొట్టినట్లు తెలుస్తోంది.  ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్నారు.

కాశ్మీర్ అందాలు.. గత కొన్ని ఏళ్లుగా తీసుకువచ్చిన మార్పులకు మంత్రముగ్ధులయిన క్రీడాకారులు, అధికారులు జమ్మూ కశ్మీర్  టూరిజం, శాంతి, ప్రశాంతతను ప్రోత్సహించే బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారతారు” అని ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

నేటి నుంచి కాశ్మీర్ లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ను ప్రారంభంకానున్నాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో 11 క్రీడా విభాగాల్లో 1,500 మంది పాల్గొంటారని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడో వెర్షన్ నేటి నుంచి ఈనెల 14 వరకు గుల్మార్గ్‌లో జరగనుంది.

దేశ వ్యాప్తంగా 1500 మంది క్రీడాకారులు ఆరు రోజుల్లో 11 ఈవెంట్‌లలో తలపడనుండగా.. ప్పటివరకు ఇక్కడ నిర్వహిస్తున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అతిపెద్దదైనవని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈవెంట్లలో పాల్గొనడానికి దేశంలోని 29 రాష్ట్రాలు  కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1500 మంది క్రీడాకారులు ఇక్కడికి చేరుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles