AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాన్న ప్రేమ అంటే ఇదే.. స్కూల్ ఫంక్షన్‌లో కూతురి కోసం డాన్స్ స్టెప్స్ వేసిన తండ్రి..

తండ్రి తన కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. ఓ వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆ క్లిప్‌లో తండ్రి తన కుమార్తెకు డ్యాన్స్ నేర్పడంలో సహాయం చేస్తూ కనిపించాడు.

Viral Video: నాన్న ప్రేమ అంటే ఇదే.. స్కూల్ ఫంక్షన్‌లో కూతురి కోసం డాన్స్ స్టెప్స్ వేసిన తండ్రి..
Father S Love Video
Surya Kala
|

Updated on: Feb 08, 2023 | 1:06 PM

Share

తన ఇంటికి కూతురు మహారాణి.. తన తల్లే మళ్ళీ పుట్టిందని.. లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతురిని ఎంతో గారంగా పెంచుకుంటాడు. ఏ ఇంట్లో అయితే కూతుళ్లు ఉంటారో? వాళ్ళు భాగ్యవంతులు..ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి.. కూతురు జీవితంలో నాన్న ఓ నమ్మకం.. ఓ రియల్ హీరో.. నాన్నకు తన కూతురు మరో అమ్మ.. ఆ కూతురికి నాన్న అంటే ఆకాశమంత ప్రేమ. ఇలా ఎంత చెప్పుకున్న తండ్రీ కూతురు రిలేషన్ గురించి తరగదు. తండ్రి కూతురు ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికే తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా తండ్రి తన కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. ఓ వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆ క్లిప్‌లో తండ్రి తన కుమార్తెకు డ్యాన్స్ నేర్పడంలో సహాయం చేస్తూ కనిపించాడు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న తన కూతురికి స్టెప్స్ ను ప్రాంప్ట్ చేస్తూ కనిపించాడు తండ్రి.. తన కుమార్తె డ్యాన్స్ స్టెప్‌ను మరచిపోకుండా చూసుకున్నాడు.

వైరల్ క్లిప్ లో ఓ చిన్నారి బాలిక తన తోటి స్నేహితులతో కలిసి స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో వేదికపై డ్యాన్స్ చేస్తోంది. అది కూడా   దలేర్ మెహందీ ఐకానిక్ సాంగ్ ‘తునక్ తునక్’కి డ్యాన్స్ చేస్తోంది. అయితే వేదికపై కూతురు డ్యాన్స్ చేస్తుండగా.. తన కూతురు సాంగ్ కు స్టెప్స్ మరచిపోకుండా.. ఎదురుగా నిల్చుకుని సెప్ట్స్ ను ప్రాంప్ట్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

24 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు    ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి 1.42 లక్షల వ్యూస్ ను, 6244 లైక్‌లసహా అనేక రీ ట్విట్స్ తో హోరెత్తిస్తోంది.

తండ్రీ-కూతురు ద్వయంపై నెటిజన్లు ప్రేమను కురిపించారు. ”నాన్న లా ఎవరూ ఉండరు.. తన కూతురుకి ఎల్లప్పుడూ అత్యుత్తమ ఛీర్‌లీడర్.. కూతురు చిన్న చిన్న విజయాలు కూడా తండ్రి గర్వంగా ఫీల్ అవుతాడు. నేను 16 సంవత్సరాల క్రితం నాన్నను  కోల్పోయాను, కానీ అతను ఇప్పటికీ నన్ను చూస్తున్నాడని నమ్ముతున్నానని తన తండ్రిపై ప్రేమని గుర్తు చేసుకున్నాడు ఒకరు.

చాలా అద్భుతంగా ఉంది..  తండ్రి అంకితభావానికి నిదర్శనం.. ఆ కూతురు అదృష్టం.” అని మరొకరు.. ”పిల్లల పురోగతి, విజయాలే తండ్రిని హీరోని చేస్తాయి.. సూపర్ క్యూట్… పిల్లలందరూ .. వారి తల్లితండ్రుల నుండి ఇలా ప్రేమని పొందుతూనే ఉంటారు.. ఇలా రకరకాల కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..