Viral Video: 35 ఏళ్ల ఏనుగుని రక్షించడానికి భారత ఆర్మీ కృషి.. మీరు రియల్ హీరోస్ అంటున్న నెటిజన్లు

35 ఏళ్ల ఏనుగు ఆరోగ్యంగా ఉన్నంత కాలం అనేక సేవలను అందించాడు. అయితే గాయపడిన ఏనుగు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తన కాళ్లపై తాను నిలబడలేకపోయింది.. అంతేకాదు.. శరీరాన్ని కూడా  కదపలేకపోయింది. ఏనుగు పరిస్థితిని చూసిన ఒక వైల్డ్‌లైఫ్ సంస్థ భారత ఆర్మీ సహాయాన్ని అర్ధించారు.

Viral Video: 35 ఏళ్ల ఏనుగుని రక్షించడానికి భారత ఆర్మీ కృషి.. మీరు రియల్ హీరోస్ అంటున్న నెటిజన్లు
Indian Army
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2023 | 11:45 AM

భారత ఆర్మీ.. దేశ రక్షణ మాత్రమే కాదు.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో లేదా.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి వెనుకాడదు.. తాజాగా ఇండియన్ ఆర్మీ మరోసారి ఆపదలో తామున్నామంటూ ఆదుకోవడానికి ముందుకొస్తామని.. ఇందుకు మనుషులు, పశువులనే తేడా లేదని తన చర్యల ద్వారా చాటి చెప్పింది. భారత ఆర్మీ 35 ఏళ్ల ఏనుగును రక్షించేందుకు వైల్డ్‌లైఫ్ SOSతో సహకరించింది. సైన్యం చర్యలకు వెటర్నరీ కూడా సపోర్ట్ అందిస్తోంది. ఇదే విషయాన్ని భారత ఆర్మీ సంస్థ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి వెల్లడించింది.

ఉత్తరాఖండ్‌లో 35 ఏళ్ల ఏనుగు ఆరోగ్యంగా ఉన్నంత కాలం అనేక సేవలను అందించాడు. అయితే గాయపడిన ఏనుగు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తన కాళ్లపై తాను నిలబడలేకపోయింది.. అంతేకాదు.. శరీరాన్ని కూడా  కదపలేకపోయింది. ఏనుగు పరిస్థితిని చూసిన ఒక వైల్డ్‌లైఫ్ సంస్థ భారత ఆర్మీ సహాయాన్ని అర్ధించారు. వెంటనే రంగంలోకి దిగిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ VK సింగ్ వైల్డ్‌లైఫ్ SOS బృందానికి సహాయం చేశారు.

ఇవి కూడా చదవండి

ఏనుగుకి అవసరం అయిన సహాయాన్ని చికిత్సను అందించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన  ఇంజినీర్ల బృందం మోతీ నిలబడే విధంగా ఒక ప్రత్యేక టవర్ ను నిర్మించారు. అదీ 24 గంటల్లోపే ఒక ప్రత్యేక టవర్‌ను నిర్మించారు. దీని సాహాయంతో ఏనుగు తన కాళ్లపై నిలబడే విధంగా చేస్తారు. గాయపడిన ఏనుగు ఇప్పుడు తన ముందు కాళ్ళపై బరువును మోయలేకపోతోంది. దీంతో దానికి సరిపడా ఎత్తు ని నిర్మించారు. గాయానికి మసాజ్ చేస్తూ.. మందులను అందిస్తున్నారు. కాళ్ళ ప్రసరణ , పనితీరును పెంచగలిగేలా చేస్తూనే.. దాని నొప్పి నివారణ కోసం చికిత్సను అందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ జిల్లాలో ఇప్పుడు జంబో సంరక్షణ పొందుతోంది. తాజాగా ఏనుగు పరిస్థితి గురించి భారత సైన్యం ట్వీట్ చేసింది.

ఏనుగు అలసిపోయాడు.. విశ్రాంతి తీసుకుంటున్నాడు.. ఆరోగ్యం తిరిగి సంతరించుకుని మళ్ళీ లేచి తిరిగేలా తాము ప్రయత్నం చేస్తామని ఆర్మీ సంస్థ ట్విట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఏనుగుని రక్షించేందుకు సకాలంలో జోక్యం చేసుకున్న భారత సైన్యానికి నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు. “ధన్యవాదాలు ఇండియన్ ఆర్మీ, మీరు మమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాదు.. అవసరం వేళ మేమున్నామంటూ జంతువులను రక్షించడానికి కూడా మీరు మీ వంతు కృషి చేస్తారు..” అని ఒకరు రాశారు. మరొకరు  “నేను బృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..