Viral Video: వయసుపైబడినా తగ్గని ప్రేమానురాగాలు..! గుండెల్ని పిండేస్తున్న అద్భుత వీడియో వైరల్…
భారతదేశంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఆడబిడ్డ తన సోదరుల మణికట్టుపై రాఖీ కట్టి, వారిని ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, తనకు రక్షగా నిలబడాలని కోరుకుంటారు. ఈ పండుగ అక్కా తమ్ముడు, అన్నా చెల్లెలి మధ్య విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది. అయితే, ప్రస్తుతం రాఖీ పండగ లేకపోయినా ఆ బంధాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గామారి అందరినీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఒక అద్భుత వీడియో వైరల్ అవుతోంది. ఇది సందర్భం కాకపోయినా కూడా పాత వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఒక వృద్ధురాలు తన సోదరుల ఇళ్లకు వెళ్లి వారి చేతులకు రాఖీ కట్టడం చూపించారు. ఈ దృశ్యాలను ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైరల్ వీడియోలో ముడతలు పడిన ముఖంతో, వణుకుతున్న అడుగులతో ఉన్న ఒక వృద్ధ మహిళ తన సోదరులకు రాఖీ కట్టేందుకు వారి ఇంటికి వచ్చింది.
ఆమె తన సోదరుల దగ్గరకు ప్రేమగా వెళ్లి, వారి చేతులకు రాఖీ కట్టి, కొబ్బరి కాయను అందిస్తుంది. ఆ వృద్ధ అవ్వ సోదరులు కూడా చిన్నవారు కాదు.. వారందరూ వృద్ధులే. అమ్మమ్మ తన ఇద్దరు సోదరులకు ఒకరి తర్వాత ఒకరికి రాఖీ కట్టింది. ఆమె ఇద్దరు సోదరులు ఆమెను ప్రేమగా, ఎంతో అప్యాయంగా చూసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @jogubhadarbar30 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. లక్షలాది మంది వీడియో చూశారు. వేలాది మంది వీడియోని లైక్ చేస్తూ కామెంట్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
వీడియో చూసిన తర్వాత అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ప్రజలు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందించారు. వయస్సు గడిచిపోతుంది.. శరీరం బలహీనపడుతుంది. కానీ, అక్కా తమ్ముడు, అన్నా చెల్లెలి మధ్య ప్రేమకు ఎప్పుడూ వృద్ధాప్యం రాదు.. అంటూ చాలా మంది కామెంట్ చేశారు. తోబుట్టువుల మధ్య ఈ ప్రేమ అమూల్యమైనది అంటూ చాలా మంది రాశారు. అలాగే మరికొందరు నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేశారు. నేటి రోజుల్లో ఈ వయస్సులో కూడా ఎవరూ తమ సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్ళరు. నిజం చెప్పాలంటే ప్రస్తుత సంబంధాలు హృదయంతో కాకుండా డబ్బుతో ముడిపిడి ఉన్నాయంటూ చాలా మంది స్పందించారు.
రిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




