AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండచిలువకు కోపమొస్తే ఇంతే మరి..! వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

సాధారణంగా ఏ వ్యక్తి అయినా దూరం నుంచి కొండచిలువను చూస్తే చాలు.. గుండె ఒక్క క్షణం ఆగినంత పనవుతుంది. అలాంటిది దానికి ఏదైనా జంతువు చిక్కితే.. ఇంకేమైనా ఉందా.? అలాంటి ఓ థ్రిల్లింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: కొండచిలువకు కోపమొస్తే ఇంతే మరి..! వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
Python
Ravi Kiran
|

Updated on: Nov 20, 2025 | 5:35 PM

Share

ప్రపంచంలో పాములను చూసి భయపడని వారుండరు. ఓ ప్రాంతంలో పాములు ఉన్నాయని చెబితే చాలు.. అటు వైపు వెళ్లడానికి కూడా ఆలోచించరు. అలాంటిది ఓ కొండచిలువ మనకు దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.? గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. కొండచిలువకు ఏ జంతువు చిక్కినా.. పైప్రాణాలు పైకే పోతాయి. మరి ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు చూసేద్దాం.

ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. సింగపూర్ వైల్డ్‌లైఫ్ సైటింగ్స్ అనే సంస్థ ఈ వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మార్కస్ లీ అనే వ్యక్తి తన ఇంటి పొదల్లో నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించాడు. అక్కడ ఏముందా అని చూడగా.. ఓ పెద్ద కొండచిలువ పిల్లిని చుట్టేసి.. మింగడానికి ప్రయత్నిస్తున్నట్టు గుర్తించాడు. వెంటనే అతడు ఆ కొండచిలువ తోక పట్టుకుని పైకి లాగాడు. ధైర్యంగా పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కొండచిలువను ఓ కాలితో తొక్కి పట్టుకుని.. పిల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ కొండచిలువ చివరికి పిల్లిని వదిలేసింది. ఆ తర్వాత సైలెంట్‌గా సమీపంలోని చెట్లలోకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.