Viral News: మార్కెట్‌లో సందడి చేస్తోన్న బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్.. హాట్ కేక్‌లా అమ్ముడవుతోన్న దీని గురించి తెలుసా
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికాలో తల్లి పాలతో ఐస్ క్రీమ్ తయారు చేసినట్లు ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. బ్రూక్లిన్‌లోని డంబోలోని ఆడ్‌ఫెలోస్ అనే ఐస్ క్రీం కంపెనీ "బ్రెస్ట్ మిల్క్" ఐస్ క్రీంను విడుదల చేసింది. అయితే ఈ ఐస్ క్రీమ్ ని నిజంగా తల్లి పాలతో తయారు చేశారా లేదా అనే నిజం తెలుసుకుందాం..

ఐస్ క్రీమ్ ని సాధారణంగా పాలతో తయారు చేస్తారు. దీని రుచి, వాసన అన్నీ అద్భుతంగా ఉంటాయి. అయితే ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ మార్కెట్ లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మహిళ తల్లి పాలతో ఐస్ క్రీం తయారు చేసింది. ఈ ఐస్ క్రీం రుచి కూడా తల్లి పాలులా ఉంటుందట. ఈ వార్త న్యూయార్క్ నగరంలో భారీ సంచలనం సృష్టించింది. బ్రూక్లిన్‌లోని డంబోలోని ఆడ్‌ఫెలోస్ ఐస్ క్రీం కంపెనీ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ ప్రారంభించింది. ఇది భారీ సంచలనం సృష్టించింది. అదే సమయంలో దీనిని కొనడానికి ప్రజలు క్యూలో నిలబడ్డారు. అయితే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ తయారీలో నిజం ఏమిటంటే ఈ ఐస్ క్రీమ్ నిజమైన తల్లి పాలతో తయారు చేయలేదు. తల్లిపాలకు బదులుగా.. దీనిని లిపోసోమల్ బోవిన్ కొలొస్ట్రమ్ పదార్థాలతో తయారు చేశారు. ఇది తల్లి పాలలో కనిపించే ఆహార పదార్ధం అని చెబుతున్నారు.
దీనిని డెజర్ట్ కోసం ఉపయోగిస్తారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ రుచిని పేరెంటింగ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఫ్రిడా కంపెనీ సహకారంతో ఇస్తారు. ప్రతిరోజూ 50 ఉచిత స్కూప్‌లు మాత్రమే ఇస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ స్థానికులకు మంచి ఆకర్షణీయంగా మారింది. కాలిఫోర్నియాలోని మమ్మత్ లేక్స్ నివాసి చార్లీన్ రిమ్‌షా రాక్‌అవే బీచ్‌లోని ఈ దుకాణానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె అక్కడ ఈ ఐస్ క్రీం కొన్నారు. ఈ సమయంలో ఆమెకు తన తల్లి గుర్తుకు వచ్చిందని .. తన తల్లి తనకు ఒకటిన్నర సంవత్సరాలు తల్లిపాలు ఇచ్చింది. అయితే ఆ విషయం ఖచ్చితంగా నాకు గుర్తులేదు. అయితే ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు భావోద్వేగపరంగా, మానసికంగా పదిలంగా ఉన్నాయి. ఈ బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు తనకు మళ్ళీ అమ్మ గుర్తుకొచ్చి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పింది.
View this post on Instagram
61 ఏళ్ల డేల్ కప్లాన్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. “ఈ ఐస్ క్రీంతో తనకు ఎలాంటి ఫీలింగ్ రాలేదని చెప్పారు. మరొకరు ఈ ఐస్ క్రీంను తినేందుకు చాలా దూరం వచ్చానని అన్నారు. దీనికి “వనిల్లా లాంటి” రుచి ఉంది. మరో మహిళ తన నాలుగు నెలల కొడుకుతో కలిసి ఐస్ క్రీం తిన్నానని.. అయితే అది మామిడికాయ రుచితో ఉందని చెప్పింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
