Watch: ఫుట్‌బాల్ అభిమానుల గుంపులోకి దూసుకెళ్లిన కారు..50 మందికి గాయాలు..
ఘటనకు సంబంధించి సీసీన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుట్‌బాల్ అభిమానులంతా ఆనందంతో సంబరాలకు సిద్ధపడుతుండగా, వేగంగా దూసుకొచ్చిన కారు వారి ఆనందాలను ఆవిరి చేసేంది. ఒక్కసారిగా అక్కడి వాతావరణ మంతా హహాకాలతో నిండిపోయింది. ఆ భయానక దృశ్యాలను చూసిన ప్రజలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

బ్రిటన్‌లో కారు ఢీకొని ఫుట్‌బాల్ అభిమానులు చితికిపోయారు. ఈ ఘటనలో 50 మంది గాయపడ్డారు. 27 మంది ఆసుపత్రిలో చేరారు. అనుమానితుడిగా 53 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రీమియర్ లీగ్‌లో ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ విజయాన్ని జరుపుకోవడానికి పరేడ్ చేస్తున్న అభిమానుల బృందంపై కి అతను తన కారుతో దూసుకొచ్చాడు. ఈ సంఘటన సోమవారం నగర కేంద్రంలో జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసింది.
సోమవారం సిటీ సెంటర్‌లో ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయోత్సవాలు జరుపుకుంటున్న లివర్‌పూల్ అభిమానులపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో కనీసం 50 మంది గాయపడగా, 27 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 53 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉగ్రవాదానికి సంబంధించినది కాదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో కనీసం 20 మందికి చికిత్స అందించగా, మరో 27 మందిని ఆసుపత్రికి తరలించామని, వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
Ufffff 🤯 Un wn se volvió loco contra los aficionados del Liverpool en la Premier League pic.twitter.com/HpnGn8CtpY
— koke_nortino (@antofaopina2022) May 27, 2025
ఘటనకు సంబంధించి సీసీన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుట్‌బాల్ అభిమానులంతా ఆనందంతో సంబరాలకు సిద్ధపడుతుండగా, వేగంగా దూసుకొచ్చిన కారు వారి ఆనందాలను ఆవిరి చేసేంది. ఒక్కసారిగా అక్కడి వాతావరణ మంతా హహాకాలతో నిండిపోయింది. ఆ భయానక దృశ్యాలను చూసిన ప్రజలు షాకింగ్ కామెంట్స్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
⚠️Footage – A man has been detained after a car collided with a number of pedestrians on Water Street in Liverpool City Centre during the Liverpool F.C victory parade.
The car stopped at the scene and the suspect has been detained by police. Multiple emergency services on scene pic.twitter.com/6gpmmcaOU2
— ExpressGB 🇬🇧 (@expressgbnews) May 26, 2025
అయితే, గతంలోనూ ఇదే తరహా ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలాసార్లు, ఉగ్రవాదులు ప్రజలపై దాడి చేయడానికి ఇలాగే, కారుతో జన సమూహాలపైకి దూసుకొచ్చి తొక్కించిన ఉదంతాలు అనేకం జరిగాయి. అయితే, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం జరిగిన ఘటన ఉగ్రదాడి కాదని తెలిసింది. ఫుట్‌బాల్ అభిమానులపై దూసుకొచ్చిన కారు 53ఏళ్ల బ్రిటిష్ వ్యక్తిది నిర్ధారించారు. కానీ, అతడు ఎందుకు ఇలా చేశాడనే దానిపై పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




