AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మనల్ని ఎవడ్రా ఆపేది..! పుంజుతో తలపడిన కోడి పిల్ల.. వైరల్ అవుతున్న వీడియో..

సరిగ్గా నెల రోజుల వయసు కూడా లేని ఆ చిన్నిది తన తండ్రిని కోడి పందెల తరహాలో ఢీకొడుతోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో..

Watch Video: మనల్ని ఎవడ్రా ఆపేది..! పుంజుతో తలపడిన కోడి పిల్ల.. వైరల్ అవుతున్న వీడియో..
Miniature Vs Hen
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 21, 2023 | 2:09 PM

Share

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనే  తెలుగు సామెతను మీరు వినే ఉంటారు. చిన్నతనంలోనే ఘనకార్యాలు చేసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇదే తరహాలో ఓ చిన్ని కోడి పిల్ల తన తండ్రితో పోటీకి దిగింది. సరిగ్గా నెల రోజుల వయసు కూడా లేని ఆ చిన్నిది తన తండ్రిని కోడి పందెల తరహాలో ఢీకొడుతోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఫ్యూచర్ చాంపియన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంకా దాని పోరాట స్ఫూర్తిని మెచ్చిన నెటిజన్లు వారి ప్రశాంసత్మక కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

color.___.ful అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో  ఒక చిన్ని కోడి పిల్ల దానికెదురుగా ఉన్న కోడిపుంజుతో తలపడుతుంది. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కోడిపుంజు మీదకు దూకుతుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 71 వేల మంది లైక్ చేశారు. ఇంకా దాదాపు 86లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు ఈ వీడియోను చూసి ‘పోరాడాటానికే పుట్టంది. గెలవడానికి పోరాడుతుంద’ని కామెంట్ చేస్తున్నారు. ఇంకా మరి కొందరు ‘ఆ తండ్రి తన బిడ్డకు పోరాటానికి కావలసిన ట్రైనింగ్ ఇస్తున్నా’డంటూ రాసుకొచ్చారు. ఇలా నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోడి పిల్ల వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..