Watch Video: డెడికేషన్ అంటే ఇదే మరి..! ఆటైనా, పాటైనా తగ్గేదేలేదంటున్న ‘సూపర్ సింగర్’.. వైరల్ వీడియో మీ కోసం..

పెంపుడు కుక్కలను పెంచుకునేవారు వాటిని తమ బిడ్డలుగా, ఆ ఇంట్లోని పిల్లలు దానిని తమ తోబుట్టువుగా గారం చేస్తుంటారు. అయితే ఆ పెంపుడు జంతువే ఇప్పుడు చిలక చేసే డ్యూటీ.. అంటే పాటలు పాడితే..? ఎలా ఉంటుంది..?

Watch Video: డెడికేషన్ అంటే ఇదే మరి..! ఆటైనా, పాటైనా తగ్గేదేలేదంటున్న ‘సూపర్ సింగర్’.. వైరల్ వీడియో మీ కోసం..
Pet Dog Singing
Follow us

|

Updated on: Mar 21, 2023 | 2:10 PM

చిలుకలు చాలా బాగా మాట్లాడాతాయి. ఇంకా వాటిలో కొన్నింటికి పాటలు పాడడం కూడా వచ్చు. అందుకే చిలుకలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక జంతువులలో అత్యధికంగా మానవుడి ప్రేమను పొందినదే కుక్కలు మాత్రమే. నిజానికి వాటిని పెంపుడు కుక్కలు అనడం కంటే పెంపుడు పిల్లలు అనడం సమంజసం. ఎందుకంటే పెంపుడు కుక్కలను పెంచుకునేవారు వాటిని తమ బిడ్డలుగా, ఆ ఇంట్లోని పిల్లలు దానిని తమ తోబుట్టువుగా గారం చేస్తుంటారు. అయితే ఆ పెంపుడు జంతువే ఇప్పుడు చిలక చేసే డ్యూటీ.. అంటే పాటలు పాడితే..? ఎలా ఉంటుంది..? అద్దిరిపోతుంది కదా..! ఇప్పుడు నెట్టింట అదే జరుగుతోంది. ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఆ పెంపుడు కుక్క ఏకంగా కీబోర్డు ప్లే చేస్తూ.. రాగాలు తీస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ‘సూపర్ సింగర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

doodledogsworld అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క కీబోర్డు ప్లేచేస్తూ.. గాల్లోకి తల ఎత్తి మరీ రాగాలు తీస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ కుక్క పిల్లలోని ఉత్సాహాన్ని, ఆసక్తిని కూడా మనం గమనించవచ్చు. ఆ కారణంగానే ఈ వీడియో నెటిజన్లకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 49వేల లైకులు, 45లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు ఆ కుక్క పిల్లలో చాలా టాలెంట్ ఉందని, మరి కొందరు పొగడటానికి మాటల్లేవ్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఆ పెంపుడు కుక్క పాట పాడుతున్న వీడియోను ఇక్కడ చూడండి..  

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..