Ramadan 2023: భారత్‌లో రంజాన్ నెల ప్రారంభం ఎప్పుడు..? సహర్, ఇఫ్తార్ టైమింగ్స్ వివరాలివే..
రంజాన్ మాసం ప్రారంభం ముస్లీంల పరమ పవిత్ర మసీదైన మక్కాపై చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రంజాన్ మార్చి 22 లేదా మార్చి 23న ప్రారంభమై..

ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ త్వరలోనే రానుంది. ఈ క్రమంలోనే పవిత్ర రంజాన్ మాసం మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. అయితే రంజాన్ మాసం ప్రారంభం ముస్లీంల పరమ పవిత్ర మసీదైన మక్కాపై చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రంజాన్ మార్చి 22 లేదా మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ రోజున ముగుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లో కూడా మార్చ్ 21వ తేదీ అంటే ఇవాళ చంద్ర దర్శనమైతే 22 నుంచి ఉపవాసాలు ప్రారంభమవుతాయని కొందరు వాదిస్తున్నా.. మెజార్టీ ముస్లింలు మాత్రం రేపే చంద్రదర్శనమని అంటున్నారు. ఒకవేళ రేపు చంద్రుని దర్శనమైతే భారత్‌లోని ముస్లింల ఉపవాస దీక్షలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే రంజాన్ మాసం ప్రారంభం, ముగింపు నిర్ణయించడానికి మక్కాపై నెలవంక దర్శనం ముఖ్యం.
అయితే ఈ పవిత్ర మాసం ఖచ్చితమైన తేదీ ఓ దేశం నుంచి మరో దేశానికి మారుతూ ఉంటుంది. స్థానిక సంప్రదాయం ప్రకారం, మధ్యప్రాచ్య దేశాలు రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ రెండింటినీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఒకరోజు ముందుగానే జరుపుకుంటాయి. యూఏఈలో మార్చ్ 21 సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అనంతరం నెలవంక దర్శనం ఉంటుంది. అంటే ఆ దేశం రంజాన్ మార్చి 23న ప్రారంభమవుతుంది, ఇండోనేషియాలో ఇది మార్చి 22 న ప్రారంభమవుతుంది. కువైట్, లెబనాన్, మాల్దీవులు, మొరాకో, ఖతార్, సౌదీ అరేబియా, ట్యునీషియా ,టర్కీలలో కూడా మార్చి 23న రంజాన్ నెల ప్రారంభమవుతుంది. చంద్రుని దర్శనాన్ని బట్టి ప్రతి దేశం ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనుంది.
భారత్‌లో చంద్రవంక దర్శనం:




అరబ్ దేశాల్లో చంద్ర దర్శనం రేపే ఉంటుందని.. ఆలా జరిగితే ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని చాలామంది విశ్వసిస్తున్నారు. ఇక భారత్ విషయాన్ని పరిశీలిస్తే.. మార్చ్ 22వ తేదీ అంటే రేపు చంద్ర దర్శనమయ్యేందుకు పూర్తి అవకాశాలున్నాయి. అదే జరిగితే మన దేశంలో కూడా గురువారం నుంచే ఉపవాసాలు ప్రారంభం కావచ్చు. సాధారణంగా అరబ్ దేశాల్లో రంజాన్ ప్రారంభ తేదీకు ఒకరోజు తరువాత భారత్‌లో రంజాన్ ప్రారంభమవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏ రోజు రంజాన్ ప్రారంభమవుతుందనే విషయంపై ఆసక్తిగా నెలకొంది.
భారత్‌లో నగరాలవారీగా సహర్.. ఇఫ్తార్ సమయాలు:
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..