AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Micro Oven: మైక్రోఓవెన్‌లో పెట్టకూడని పదార్థాలివే.. పెడితే నిముషాల్లోనే పేలిపోవడం ఖాయం..

మైక్రో ఓవెన్.. బద్ధకస్తుడికి బెస్ట్ ఫ్రెండ్‌ ఇది. ఎందుకంటే ఒక్కసారి వండుకుని.. మూడు పూటలా దానినే తినే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో తినే ముందు ఒకసారి వేడి..

Micro Oven: మైక్రోఓవెన్‌లో పెట్టకూడని పదార్థాలివే.. పెడితే నిముషాల్లోనే పేలిపోవడం ఖాయం..
Microwave Oven
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 21, 2023 | 12:06 PM

Share

మైక్రో ఓవెన్.. బద్ధకస్తుడికి బెస్ట్ ఫ్రెండ్‌ ఇది. ఎందుకంటే ఒక్కసారి వండుకుని.. మూడు పూటలా దానినే తినే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో తినే ముందు ఒకసారి వేడి చేసుకుంటే చాలు అన్నట్లుగా చాలా మంది ఒకసారి వండి మూడు పూటలా దానినే తింటారు. అందుకే ఇది వంట పనినే కాదు, జీవితాన్ని సులభతరం, బద్ధకంగా తయారు చేస్తుందంటారు. ఈ అత్యాధునిక యాక్సెస్సరీ మనం తినే పదార్థాలను వేడి చేయడమే కాక బేకింగ్‌లోనూ ఉపయోగపడతుంది. అంటే మైక్రో ఓవెన్ ద్వారా కేకులు, బిస్కెట్లు వంటివాటిని కూడా తయారు చేసుకొని తినవచ్చు. కానీ ఈ మైక్రో ఓవెన్ వాడే ముందు కొన్ని రకాల విషయాలు తెలుసుకోవాలి. దీనిలో ఏ పదార్థాలను వేడి చేయాలి..? వేటిని చేయకూడదనే వివరాలను ముందుగానే తెలుసుకొని ఉపయోగించాలి. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను మైక్రో ఓవెన్‌లో పెట్టడం వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మైక్రో ఓవెన్‌లో ఏయే పదార్థాలను వేడి చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లు: ఉడికించిన గుడ్లు లేదా రిఫ్రిజిరేటర్లో ఉంచి అప్పుడే తీసిన గుడ్లను మైక్రో ఓవెన్‌లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే గుడ్డు పెంకులతో సహా ఓవెన్లో పెట్టడం వల్ల లోపల అవి పేలి, విద్యుత్ ప్రమాదాలకు కారణం కాగలవు. ఉడికించిన గుడ్లను పెంకు తీసేసిన తర్వాత వేడి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు, కానీ పెంకులతో పాటు గుడ్డును లోపల పెట్టకూడదు.

టమోటో సాస్: టమోటో సాస్‌ను చాలా మంది ఓవెన్లో వేడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. టమోటో సాస్ వేడెక్కాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతకు ఓవెన్ చేరుకున్నాక ఆవిరి చాలా ఎక్కువగా మారుతుంది. దీనివల్ల దానిలో పేలుడు సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

నీళ్లు: చాలామంది నీటిని మైక్రోఓవెన్‌లోనే వేడి చేస్తారు. నీటిని వేడి చేసే సమయంలో బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలు పేలడం వల్ల ఒక్కొక్కసారి ఓవెన్ పేలే ప్రమాదం ఉంది. ఒకవేళ నీటిని వేడి చేయాలి అనుకుంటే చాలా తక్కువ సమయంలోనే బయటికి తీసేయాలి. 30 సెకన్ల కన్నా ఎక్కువ సమయం నీటిని ఓవెన్లో లోపల ఉంచకూడదు.

మిరపకాయలు: ఎరుపు, పసుపు రంగులో ఉండే మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది మిరియాలకు, మిరపకాయలకు మండుతున్న రుచిని ఇస్తుంది. మిరపకాయలను మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేయడం వల్ల అధిక ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మైక్రో ఓవెన్ డోర్ తీయగానే ఆ ఆవిరి మన ముక్కు, కళ్ళు, శ్వాసకోశ భాగాలకు పట్టేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఓవెన్ లో ఎప్పుడు మిరపకాయలను ఉంచకూడదు.

ద్రాక్ష : ద్రాక్ష పండ్లను మైక్రోఓవెన్ లో పెడితే చాలా ప్రమాదం.వాటిని మైక్రోఓవెన్లో పెట్టగానే పేలే ప్రమాదం ఉంది. ఆ వేడికి అవి పేలిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..