AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 ఏళ్లుగా మంచానికి పరిమితమైన తల్లి..అమ్మ కోరికను నెరవేర్చిన కొడుకు

పిల్లల అక్కడికి, ఇక్కడికి తీసుకెళ్లాని తల్లిదండ్రులు అడిగితే వారు ఎప్పుడో ఓ సారి తీసుకెళ్తారు.

32 ఏళ్లుగా మంచానికి పరిమితమైన తల్లి..అమ్మ కోరికను నెరవేర్చిన కొడుకు
Son Showing Tajmahal To His Mother
Aravind B
|

Updated on: Mar 21, 2023 | 1:51 PM

Share

పిల్లల అక్కడికి, ఇక్కడికి తీసుకెళ్లాని తల్లిదండ్రులు అడిగితే వారు ఎప్పుడో ఓ సారి తీసుకెళ్తారు. అలాగే ఆ పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు చూడాలనుకున్న ప్రదేశాలను కూడా కొంతమంది చూపిస్తారు. అయితే గుజరాత్ లోని ఓ వ్యక్తి తన తల్లి కోసం చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 32 ఏళ్లుగా వీల్ చైర్ కే పరిమితమై ఉన్న తన తల్లి కోరిక మేరకు తాజ్ మహాల్ ను చూపించాడు ఆ కొడుకు. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని కుట్చ్ జిల్లాలోని ముంద్రా పట్టణంలో ఇబ్రహీం తన భార్య, తల్లితో జీవిస్తున్నాడు. అయితే ఇబ్రహీం తల్లి రజియా వెన్నముక సమస్యతో బాధపడుతోంది.గతంలో ఆపరేషన్ చేయించిన కూడా అది సఫలం కాలేదు. దీంతో దాదాపు 32 ఏళ్లుగా ఆమె మంచానికే పరిమితమయ్యింది.

కానీ ఇబ్రహీం తల్లికి ఎప్పటినుంచో తాజ్ మహాల్ చూడాలనే కోరిక ఉండేంది. ఆ కోరికను ఎలాగైన తీర్చాలని ఇబ్రహీం అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఓ స్ట్రెచర్ ని తయారు చేయించాడు. దాని పైనే తన తల్లిని ఆగ్రాకి తీసుకొచ్చాడు. ఆ స్ట్రెటర్ పై ఆమె పడుకొని ఉండగానే తాజ్ మహాల్ ను చూపించాడు. చాలా ఏళ్లకి తాను కోరుకున్నట్లుగా తాజ్ మహాల్ ని చూడటంతో తన తల్లి ఎంతో సంతోషించిందని ఇబ్రహీం తెలిపాడు. అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఇబ్రహీంను అభినందించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తు్నారు నెటీజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం

ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా