AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోటీ తెచ్చిన తంటా.. కట్ చేస్తే.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న రెండు గ్యాంగ్‌లు!

వారణాసిలోని రోహానియాలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ధాబాకు వెళ్లిన యువకుడు వేడి వేడి తందూరి రోటి అర్డర్ చేశాడు. చల్లటి రోటి తెచ్చినందుకు ధాబా సిబ్బంది, యువకుడి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ తరువాత, బాధితుడు తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిచి ధాబా సిబ్బందిని వెంబడించి కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రోటీ తెచ్చిన తంటా.. కట్ చేస్తే.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న రెండు గ్యాంగ్‌లు!
Varanasi
Balaraju Goud
|

Updated on: Feb 18, 2025 | 10:13 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఒక ధాబాలో వేడి వేడి తందూరీ రోటీ కోసం తీవ్ర యద్ధమే జరిగింది. ఈ విషయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు డజనుకు పైగా వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గ్రూపులుగా విడిపోయిన కొందరు వ్యక్తులు ఒకరినొకరు తన్నుకుంటూ, గుద్దుకుంటూ బీభత్సం సృష్టించారు.

రోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భద్వార్ గ్రామంలోని హైవేపై సోమవారం(ఫిబ్రవరి 17) రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భద్వార్ గ్రామానికి చెందిన ఒక యువకుడు హైవేపై ఉన్న ఒక ధాబాలో తినడానికి వెళ్ళాడు. ఈ సమయంలో, వేడి రోటీ వడ్డించడంపై అతను ధాబా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ధాబా సిబ్బంది ఆ యువకుడిని తీవ్రంగా కొట్టాడు. దీని తరువాత, ఆ యువకుడు గ్రామంలోని పది-పన్నెండు మందికి ఫోన్ చేసి పిలిపించాడు.

దీని తరువాత, ఈ వ్యక్తులు ధాబా సిబ్బందిని వెంబడించి కొట్టి, ధాబాను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న రోహానియా పోలీస్ స్టేషన్ పోలీసులు కొద్దిసేపటిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రెండు వర్గాలు ఒకరినొకరు తన్నుకున్నారు. రెండు పార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, రెండు గ్రూపులకు చెందిన డజనుకు పైగా వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బాధితుడు తన ఫిర్యాదులో ప్లేట్‌లో చల్లని రోటీ వేశాడని ఆరోపించాడు.

వేడి వేడి రోటీ తెస్తున్నానని చెప్పాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేడి వేడి రోటీ అడిగినప్పుడు, ధాబా యజమాని తనను దుర్భాషలాడడని ఆ యువకుడు చెబుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత, నిందితుల పేర్లను జత చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం