Viral Video: దీపావళికి ఇల్లు క్లీన్ చేయమన్న తల్లి.. ఆ యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్
దీపావళికి ఇల్లు క్లీన్ చేయమన్నందుకు ఓ యువతి చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఇల్లు క్లీన్ చేయమని అన్నదమ్ములను కాకుండా తల్లి తనను మాత్రమే అడగడంతో ఆ యువతికి మస్త్ కోపం వచ్చింది. దీంతో ఏకంగా టవర్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

దీపావళి వచ్చిందంటే ఇళ్లంతా శుభ్రం చేయాలి. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఒక యువతికి సరిగ్గా ఇదే విషయంపై కోపం వచ్చింది. అమ్మ ఇల్లు శుభ్రం చేయమని చెప్పినందుకు.. ఆ కోపంలో ఆ యువతి ఏకంగా మొబైల్ టవర్ ఎక్కి కూర్చుంది. కిందకు దిగనని, దూకి చనిపోతానని బెదిరించింది. ఈ హైడ్రామా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
మన దేశంలో చాలా ఇళ్లలో అమ్మాయిలే ఇంటి పనులు చేస్తారు. ఇక్కడ కూడా తల్లి తన కూతురిని దీపావళి శుభ్రత పనులు చేయమని అడిగింది. కానీ తన అన్నయ్య లేదా తమ్ముడిని కాకుండా తనను మాత్రమే పనులు చేయమని అడగడం ఆ యువతికి నచ్చలేదు. దీంతో మనస్తాపం చెంది, టవర్ ఎక్కి నిరసన తెలిపింది. కూతురు టవర్ ఎక్కడంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భయపడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి, నచ్చజెప్పి, ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురక్షితంగా కిందకు దిగింది. ఆమెను మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవ్వగా.. మీర్జాపూర్ పోలీసులు స్పందించారు. “కచ్వా పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే స్పందించి, ఆ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారని” తెలిపారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా చూపకుండా అందరినీ సమానంగా చూసుకోవాలని, ఇంటి పనులు అందరూ పంచుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
मिर्जापुर में एक युवती को उसकी माँ ने दीपावली पर साफ सफाई को लेकर फटकार लगाई थी, युवती गुस्से में मोबाइल टावर पर चढ़ गयी और ड्रामा किया…#Mirzapur #Video #VideoViral #LiveVideo pic.twitter.com/TdEszqODWi
— Gaurav Kumar (@gaurav1307kumar) October 17, 2025




