AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs: ఒకేసారి 50 గుడ్లు తిన్న వ్యక్తి.. చివరకు ఏమైందో తెలిస్తే షాకే..

గుడ్లలో ఉండే ప్రోటీన్లు, కేలరీలు, విటమిన్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినే అలవాటు ఉంటుంది. కొందరు 10 నుండి 12 గుడ్లు కూడా తింటారు. కానీ ఎవరైనా 50 గుడ్లు తింటే ఏమవుతుంది..? తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Eggs: ఒకేసారి 50 గుడ్లు తిన్న వ్యక్తి.. చివరకు ఏమైందో తెలిస్తే షాకే..
What Happens If You Eat 50 Eggs At Once
Krishna S
|

Updated on: Oct 19, 2025 | 9:55 AM

Share

గుడ్లు శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాల గని. ఇవి అధిక-నాణ్యత ప్రోటీన్, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఫోలేట్, సెలీనియం, ఒమేగా-3 వంటి ముఖ్యమైన పోషకాలకు ఉత్తమ వనరుగా చెబుతారు. ఇవి కండరాల బలం, మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం. అయితే కొంతమంది ఒకేసారి పెద్ద సంఖ్యలో గుడ్లు తినే ప్రయత్నం చేయడం లేదా పందేలు కాయడం చేస్తుంటారు. ఒక వ్యక్తి ఒకేసారి 50 గుడ్లు తింటే ఏమవుతుంది? ఇది మనిషి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది తెలుసుకుందాం..

50 గుడ్లను జీర్ణం చేయగలదా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనిషి కడుపు సైద్ధాంతికంగా 50 గుడ్లను జీర్ణం చేయగలిగినా, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒకేసారి అధిక మొత్తంలో ప్రోటీన్, కేలరీలు తీసుకోవడం వల్ల కడుపుపై ​​తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీని ఫలితంగా తీవ్రమైన ఉబ్బరం, ఆమ్లత్వం, గ్యాస్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇన్ని గుడ్లను ఒకేసారి తినడం వల్ల పోషకాలు సరిగ్గా గ్రహించకపోగా.. కాలేయం, మూత్రపిండాలు మరియు మొత్తం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అత్యంత అరుదైన సందర్భాలలో, ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.

రూ. 2వేల కోసం పందెం.. 42వ గుడ్డు వద్ద విషాదం

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో జరిగిన ఒక విషాదకర ఘటన ఈ ప్రమాదాన్ని నిరూపించింది. ఒకేసారి 50 గుడ్లు తింటే రూ. 2000 ఇస్తామని పందెం వేశారు. ఒక వ్యక్తి ఈ పందెం స్వీకరించి గుడ్లు తినడం మొదలుపెట్టాడు. అయితే 42వ గుడ్డు తిన్న వెంటనే అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించాడు.

ఎన్ని గుడ్లు తినడం సురక్షితం?

నిపుణుల సూచన ప్రకారం.. ఆరోగ్యవంతులైన వారు రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లు తింటే సరిపోతుంది. క్రీడాకారులు లేదా అధిక ప్రోటీన్ అవసరమైన వారు అప్పుడప్పుడు మూడు గుడ్ల వరకు తీసుకోవచ్చు. ఉడికించిన లేదా తేలికగా వేయించిన గుడ్లను తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధిక నూనెలో వేయించిన లేదా మసాలాతో కూడిన గుడ్లు ఆరోగ్యానికి అంత మంచివి కావు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.