Watch Video: పోలీసుల ఎదుటే.. ఫ్రొఫెసర్ చెంప పగలగొట్టిన విద్యార్ధిని! వీడియో వైరల్
యూనివర్సిటీలో పోలీసుల ముందే ఓ విద్యార్ధిని ప్రొఫెసర్ చెంపపై కొట్టింది. డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కళాశాల ప్రొఫెసర్‌పై గురువారం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ యూనియన్ (DUSU) జాయింట్ సెక్రటరీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో..

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఢిల్లీ యూనివర్సిటీలో గురువారం (అక్టోబర్ 17) దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ముందే ఓ విద్యార్ధిని ప్రొఫెసర్ చెంపపై కొట్టింది. డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కళాశాల ప్రొఫెసర్‌పై గురువారం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ యూనియన్ (DUSU) జాయింట్ సెక్రటరీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ దీపికా ఝా ప్రొఫెసర్‌ను చెంపదెబ్బ కొట్టి దాడి చేసింది. ఈ సంఘటన క్యాంపస్‌లో పోలీసుల సమక్షంలో జరిగడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కాలేజీలో ఇటీవల విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిలకల్లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఇటీవల వర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో గెలిచిన ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థిపై ఏబీవీపీకి చెందిన వారు దాడి చేశారు. దీంతో కాలేజీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్‌గా ఉన్న ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను అక్టోబర్ 10న డీయూఎస్‌యూ సంయుక్త కార్యదర్శి దీపికా ఝా, ఏబీవీపీ సభ్యులు కలిశారు. అయితే మాట్లాడుతన్న క్రమంలో ప్రొఫెసర్‌కు, విద్యార్ధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రొఫెసర్‌ను రాజీనామా చేయమని విద్యార్ధులు ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా చేశారు. అయినా దీపిక అనే విద్యార్ధిని పోలీసుల ముందే ప్రొఫెసర్ సుజిత్ కుమార్ చెంపపై కొట్టింది. మిగతా విద్యార్ధులు కూడా ఫ్రొఫెసర్ చుట్టుముట్టడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను రక్షించారు.
ABVP की गुंडागर्दी अपने चरम पर!
DU के BR आंबेडकर कॉलेज में DUSU जॉइंट सेक्रेटरी दीपिका ने प्रिंसिपल रूम में प्रोफेसर को थप्पड़ मारा।
ये सब @DelhiPolice की मौजूदगी में हुआ!
CCTV में सब साफ़ दिख रहा है, फिर भी कार्रवाई नहीं!
ABVP की गुंडागर्दी पर सख़्त कार्रवाई हो। pic.twitter.com/ceGW3mb12H
— NSUI (@nsui) October 16, 2025
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ చర్యను విద్యావేత్తల గౌరవంపై దాడిగా ఖండించారు. వెంటనే దర్యాప్తు జరిపడానికి విశ్వవిద్యాలయం విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ వీసీ తెలిపారు. రెండు వారాల్లోగా కమిటీ తన పరిశోధనలను సమర్పించాలని డియు వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




