Viral News: పెళ్ళికి ముందు కాబోయే భర్త మోసగాడు అని తెలుసుకుంది.. వరుడు లేకుండా పెళ్లి చేసుకుంది.. ఎక్కడంటే

బ్రిటన్‌లో వరుడు లేని అలాంటి ఓ విచిత్ర 'పెళ్లి' ఒకటి జరిగింది. కాబోయే భర్త తనను మోసం చేస్తున్నాడని అమ్మాయికి నిజానికి పెళ్లికి కొన్ని రోజుల ముందు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో వివానికి నో చెప్పింది. అయితే వివాహ కార్యక్రమాన్ని, హనీమూన్ ట్రిప్‌ను రద్దు చేయసుకోలేదు. పైగా ఇలా పెళ్లి వేడుక కోసం సుమారు రూ. 38 లక్షలు ఖర్చు చేసింది. ఈ వింత పెళ్ళికి వేడుకగా బ్రిటన్ నిలిచింది.

Viral News: పెళ్ళికి ముందు కాబోయే భర్త మోసగాడు అని తెలుసుకుంది.. వరుడు లేకుండా పెళ్లి చేసుకుంది.. ఎక్కడంటే
Wedding Without GroomImage Credit source: SWNS
Follow us

|

Updated on: Aug 27, 2024 | 6:58 PM

మీరు చాలా పెళ్లిళ్లను చూసి ఉంటారు.. అయితే అసలు వరుడు లేకుండా జరిగే పెళ్లిని ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా.. తాజాగా బ్రిటన్‌లో వరుడు లేని అలాంటి ఓ విచిత్ర ‘పెళ్లి’ ఒకటి జరిగింది. కాబోయే భర్త తనను మోసం చేస్తున్నాడని అమ్మాయికి నిజానికి పెళ్లికి కొన్ని రోజుల ముందు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో వివానికి నో చెప్పింది. అయితే వివాహ కార్యక్రమాన్ని, హనీమూన్ ట్రిప్‌ను రద్దు చేయసుకోలేదు. పైగా ఇలా పెళ్లి వేడుక కోసం సుమారు రూ. 38 లక్షలు ఖర్చు చేసింది. ఈ వింత పెళ్ళికి వేడుకగా బ్రిటన్ నిలిచింది.

ది సన్ కథనం ప్రకారం నాటింగ్‌హామ్‌షైర్‌లోని మాన్స్‌ఫీల్డ్‌లో ఈ వింత ‘పెళ్లి’ జరిగింది. 31 ఏళ్ల లిండ్సే స్లేటర్.. ఇప్పుడు బ్రేకప్ చెప్పిన వ్యక్తితో దాదాపు 12 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉంది. తమ 12 రిలేషన్ షిప్ ని పెళ్లిగా మార్చుకోవడానికి వారిద్దరూ 2020 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 ఆగస్టు 17వ తేదీన వివాహం చేసుకోవాలని తేదీని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి చేసుకుండానే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. ఎందుకంటే లిండ్సే కు తన కాబోయే భర్త వ్యవహారం గురించి నిజం తెలిసింది. తాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వ్యక్తి తనతో పాటు వేరొకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం అతను ఒప్పుకున్నాడు.

తన కాబోయే భర్త అసలు స్వరూపం తెలిసిన లిండ్సే కుప్పకూలింది. ఆమె అన్ని ఈవెంట్‌లను రద్దు చేసుకోవాలని ముందుగా భావించింది. అయితే తర్వాత వరుడు లేకుండా ప్రత్యేకమైన వివాహాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకుంది. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న రోజును ‘ఫ్రీడమ్ డే’గా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. రిపోర్ట్ ప్రకారం పెళ్లి, హనీమూన్ ట్రిప్ కోసం 46 వేల డాలర్లు (రూ. 38 లక్షలకు పైగా) వెచ్చించింది. తాను పెట్టిన ఖర్చు వృధాగా పోకుండా లిండ్సే తన కుటుంబం, స్నేహితులతో వేడుక జరుపుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె సోదరి బెత్ కూడా ఈ విషయంలో సహాయం చేసింది.

ఇవి కూడా చదవండి

దీని తరువాత లిండ్సే తన వివాహం ఆగిపోయిన విషయం గురించి అతిథులందరికీ తెలియజేసింది. అయితే తన ‘ఫ్రీడమ్ పార్టీ’లో భాగం కావచ్చని తెలిపింది. వరుడు లేకుండా జరిగిన వివాహ వేడుకకు దాదాపు 70 మంది అతిథులు హాజరయ్యారు, ఇందులో తినడం, తాగడం, నృత్యం వంటి వివిధ కార్యక్రమలున్నాయి. దీని తరువాత లిండ్సే ఏడు రోజుల హనీమూన్ ట్రిప్‌లో భాగంగా తన స్నేహితురాలితో కలిసి గ్రీస్‌కు కూడా వెళ్ళింది.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన లిండ్సే.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీంతో పాటు కష్టకాలంలో కూడా తనకు తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కానప్పటికీ.. జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మన ఆనందం, సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని లిండ్సే చేసి చూపించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాబోయే భర్త మోసగాడని పెళ్లిని రద్దు చేసుకుంది.. గ్రాండ్ గా వేడుక
కాబోయే భర్త మోసగాడని పెళ్లిని రద్దు చేసుకుంది.. గ్రాండ్ గా వేడుక
పదేళ్ల తరువాత రానున్న అర్జున్‌ రెడ్డి ఫుల్ వర్షన్‌
పదేళ్ల తరువాత రానున్న అర్జున్‌ రెడ్డి ఫుల్ వర్షన్‌
పేద విద్యార్థి చదువు కోసం క్రికెటర్ రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
పేద విద్యార్థి చదువు కోసం క్రికెటర్ రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
నా మీద కుట్ర చేశారు అంటున్న కంగనా | ఆలస్యంగా రానున్న స్పిరిట్‌
నా మీద కుట్ర చేశారు అంటున్న కంగనా | ఆలస్యంగా రానున్న స్పిరిట్‌
ఈగ సీక్వెల్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈగ సీక్వెల్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఒకరినొకరు ఢీ కొట్టుకోటానికి రెడీ అయిన తమిళ్ సూపర్ స్టార్స్
ఒకరినొకరు ఢీ కొట్టుకోటానికి రెడీ అయిన తమిళ్ సూపర్ స్టార్స్
ఓటీటీలో వచ్చేసిన రొమాంటిక్‌ మూవీ.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి
ఓటీటీలో వచ్చేసిన రొమాంటిక్‌ మూవీ.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి
కాస్ట్లీ ప్రాప‌ర్టీ అమ్మేసిన పూరి జగన్నాథ్.?
కాస్ట్లీ ప్రాప‌ర్టీ అమ్మేసిన పూరి జగన్నాథ్.?
రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే
రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే
తల్లీకొడుకులపై గొడ్డలితో దాడికి తెగబడ్డ యువకుడు..!
తల్లీకొడుకులపై గొడ్డలితో దాడికి తెగబడ్డ యువకుడు..!